నాగార్జున సరసన నటించాలనేది అమ్మ కోరిక.. వెల్లడించిన సునీత కుమారుడు!
సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాట పాడిందంటే చెవుల్లో అమృతం పోసినంత హాయిగా ఉంటుంది. టాలీవుడ్ సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఈమెకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. తన అద్భుతమైన గాత్రంతో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ఎన్నో పాటలు పాడి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తాను పాడిన ఎన్నో పాటలకు అవార్డులను కూడా అందుకున్నారు.