English | Telugu

'సూర్యకాంతం'లో హీరో సుశాంత్

మన సొసైటీలో మహిళలు ఎదుర్కొంటున్న కట్టుబాట్లు, బాధ్యతలు ఎన్నో. వాటితో పాటు వాళ్ళు ఎదుర్కొనే ఎన్నో ప్రాబ్లమ్స్ ని ఎన్నో. ఇన్ని హర్డిల్స్ ని దాటుకుని విజయవంతమైన మహిళలు కొందరే. ఆ కొందరిలో ఒకరు సూర్యకాంతం. ఐతే ఇప్పుడు ఈ సీరియల్ లో ఒక ట్విస్ట్ కనిపించబోతోంది. బిగ్ స్క్రీన్ మీద నటించిన హీరో సుశాంత్ ఇప్పుడు స్మాల్ స్క్రీన్ మీద కనిపించి సందడి చేయనున్నారు. జీ తెలుగులో ప్రసారమవుతున్న సూర్యకాంతం సీరియల్ లో గెస్ట్ రోల్ చేయడానికి సిద్దమయ్యాడు సుశాంత్. ఐతే ఇప్పుడు దీనికి సంబంధించిన టీజర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇందులో సుశాంత్ ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. అలాగే ఒక కేసును కూడా సాల్వ్ చేయడానికి రాబోతున్నాడు కూడా. ఇందులో భాగంగా సూర్య క్యారెక్టర్ తో కలిసి చేసే కామెడీ కూడా ఆడియన్స్ ని అలరించనుంది. సుశాంత్ 'అల వైకుంఠపురం'లో నటించి అలరించాడు. ఇక ఇప్పుడు సీరియల్ విషయానికి వస్తే టామ్ బాయ్ గా సూర్య జీవితం ఈ సీరియల్ లో కీ రోల్. ఐతే బాగా డబ్బున్న ఒక అతను చైతన్యను పెళ్లి చేసుకుంటుంది. ఐతే చైతన్యకి ముగ్గురు అక్కలు ఉంటారు.

వాళ్లకు సూర్య అంటే అస్సలు ఇష్టం ఉండదు. సూర్యను వాళ్ళ ఇంట్లో ఎవరూ ఒప్పుకోరు. మరి వాళ్లందరినీ ఎలా ఒప్పించి, విజయం సాధించాడు అనేదే ఈ సీరియల్ మెయిన్ స్టోరీ. ఇక ఈ సీరియల్ లో అనూష హెగ్డే, ప్రజ్వల పిడి, సాహితి, ప్రభాకర్ కీలక పాత్రలు పోషించారు. జులై 2019లో ఈ సీరియల్ ప్రారంభమయ్యింది. తమిళ్ సీరియల్ సత్య యొక్క రీమేక్ ఈ సీరియల్.