English | Telugu
రష్మీకి గుడ్ న్యూస్ చెప్పిన రాంప్రసాద్
Updated : Jul 11, 2022
బుల్లితెర మీద జబర్దస్త్ ఎంత పోపులరో ఆ షోలో రష్మీ, సుధీర్ జోడి అంతకంటే పాపులర్. ఐతే ఇప్పుడు వీళ్లకు సంబంధించి ఒక న్యూస్ ట్రెండ్ అవుతోంది. ఆషాడంలో అమ్మ కాబోతోంది రష్మీ అంటూ నాడీ పట్టుకుని జోస్యం చెప్పాడు ఆటో రాంప్రసాద్. ఆ మాటకు ఒక్కసారిగా షాక్ ఐన రష్మీ నువ్వు డాక్టర్ వా అంటూ అని అన్నందుకు ఇంత బ్లాస్టింగ్ న్యూస్ చెప్పి బాంబు పేలుస్తావా అంది రష్మీ గౌతమ్. రష్మీకి, సుధీర్ కి ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆడియన్స్ లో. హీరో హీరోయిన్స్ కి ఏమాత్రం తక్కువ కాకుండా ఉంటుంది ఈ జోడి. వీళ్లిద్దరి లవ్ ట్రాక్ సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్కే. ఏ ఇష్యూ జరిగినా దాన్ని ఈ జోడికి ఆపాదించి ఫన్ క్రియేట్ చేసి రేటింగ్స్ పెంచుకోవడం చూస్తూనే ఉన్నాం. ఆడియన్స్ కూడా మెంటల్ గా వీళ్ళిద్దరూ లవర్స్ అని ఫిక్స్ ఇపోయారు కూడా.
ఇక కొన్ని ఎపిసోడ్స్ లో లవ్ ప్రొపోజ్ చేసుకున్న స్కిట్స్ కానీ, సుధీర్ రష్మీ కోసం ప్రేమ పాటలు పాడి డాన్స్ లు చేసి మెప్పించడం, అలాగే రష్మీ సుధీర్ ప్రేమకు బహుమతిగా గిఫ్ట్స్ ఇవ్వడం, వీళ్లిద్దరికీ స్టూడియోలోనే పెళ్లి జరిగినట్టు చూపించేసరికి రీల్ లోనే కాదు రియల్ గా కూడా వీళ్లిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని రహస్యంగా పెళ్లి జరిగిపోయిందని కూడా అనుకుంటున్నారు చాలామంది. ఇక ఇప్పుడు సుధీర్ స్టార్ మాకి వెళ్లిపోయేసరికి ఇద్దరి మధ్య ఆషాఢం అడ్డు వచ్చిందట అంటూ పంచ్ డైలాగ్స్ కూడా బాగా ట్రోల్ అయ్యాయి. ఐతే ఇప్పుడు లేటెస్ట్ ఎపిసోడ్ కోసం రాంప్రసాద్ డాక్టర్ గెటప్ వేసుకొచ్చాడు. వెంటనే రష్మీ "నువ్వు డాక్టర్ వా అంటూ వెటకారమాడేసరికి ఏం నీకు నమ్మకం కలగట్లేదా" అంటూ రష్మీ నాడీ పట్టుకుని "గుడ్ న్యూస్ మీరు తల్లయ్యారు" అంటాడు. ఆ మాటకు స్టేజి మీద అందరూ అవాక్కవుతారు. అలా ఆటో రాంప్రసాద్ పంచ్ డైలాగ్ తో రష్మీ తల్లి అయ్యిందన్నమాట. ఇక ఈ లేటెస్ట్ ఎపిసోడ్ కి సీనియర్ క్యూట్ హీరోయిన్ కుష్బూ ఎంట్రీ ఇచ్చి టైమింగ్ ఉన్న పంచెస్ వేస్తూ అలరిస్తున్నారు.