English | Telugu
వెంకటేష్, మహేష్, నమ్రతల షాకింగ్ ఫోటోలు లీక్!
Updated : Nov 5, 2023
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో పెద్దోడుగా వెంకటేష్, చిన్నోడుగా మహేష్ బాబు కలిసి నటించారు. అప్పటి నుంచి ఈ ఇద్దరూ ఎక్కడైనా కలిసి కనిపిస్తే పెద్దోడు-చిన్నోడు అంటూ అభిమానులు ఎంతో సంబరపడతారు. ఇటీవల వెంకటేష్ చిన్న కుమార్తె పెళ్ళికి మహేష్ హాజరు కాగా, ఆ ఫోటోలను చూసి అభిమానులు ఎంతో సంతోషించారు. అయితే మహేష్, వెంకటేష్ కలిసి ఉన్న కొన్ని ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అవి చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.
మహేష్, వెంకటేష్ కలిసి ఉన్న కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో వారితో పాటు మరికొందరు పేకాట ఆడుతున్నట్టుగా కనిపిస్తుంది. అయితే అదొక ప్రైవేట్ పార్టీ అని కొందరు అంటుండగా, మరికొందరు మేఘ కృష్ణారెడ్డికి చెందిన క్లబ్ హౌస్ ఓపెనింగ్ వేడుక అని అంటున్నారు. మరి ఇది పార్టీనో లేక ఓపెనింగ్ వేడుకనో స్పష్టంగా తెలియడం లేదు కానీ.. ఫొటోలు మాత్రం వైరల్ గా మారాయి. ఆ ఫొటోలలో మహేష్ సతీమణి నమ్రతా శిరోద్కర్, రాజకీయ నాయకుడు దానం నాగేందర్ వంటి వారు కూడా కనిపిస్తున్నారు.