English | Telugu
రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన 'పొలిమేర-2'
Updated : Nov 5, 2023
2021లో ఎలాంటి అంచనాల్లేకుండా నేరుగా ఓటీటీలో విడుదలైన 'మా ఊరి పొలిమేర' ఊహించని స్పందన తెచ్చుకుంది. ఓటీటీలో ఈ సినిమా చూసిన వారంతా ఫిదా అయ్యారు. దాంతో రెండో భాగంపై అంచనాలు ఏర్పడ్డాయి. నవంబర్ 3న 'మా ఊరి పొలిమేర 2' థియేటర్లలో విడుదలైంది. పాజిటివ్ టాక్ తో పాటు మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈ మూవీ.. రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
'పొలిమేర-2' రూ.3.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయగా.. రెండు రోజుల్లోనే రూ.3.5 కోట్ల షేర్ రాబట్టి, మూడో రోజు నుంచి లాభాల్లోకి ఎంటరైంది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.1.83 కోట్ల షేర్(రూ.3.05 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేయగా, రెండో రోజు రూ.1.68 కోట్ల షేర్(రూ.2.95 కోట్ల గ్రాస్) రాబట్టింది. దీంతో రెండు రోజుల్లో రూ.3.51 కోట్ల షేర్(రూ.6 కోట్ల గ్రాస్)తో సత్తా చాటింది. ఈరోజు(ఆదివారం) నుంచి లాభాల్లోకి ఎంటరైన ఈ సినిమా.. ఫుల్ రన్ లో భారీ లాభాలు చూసే అవకాశముంది.