English | Telugu

నా కూతురు ఫేక్ అకౌంట్ తో మోసం.. దయచేసి నమ్మొద్దు

శేఖర్ మాస్టర్ గురించి ఆయన డాన్స్ గురించి తెలియని వాళ్లంటూ ఎవరూ లేరు. స్టార్ హీరోస్ మూవీస్ లో అద్దిరిపోయే కోరియోగ్రఫీ చేస్తూ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాడు. టీవీ షోస్ లోనూ సందడి చేస్తుంటాడు. ఆయనతో పాటు ఆయన పిల్లలు సాహితి, విన్నీ కూడా టీవీ ఛానల్స్ లో కనిపిస్తూ మంచి ఫేమ్ ని సంపాదించుకున్నారు. అలాగే శేఖర్ మాస్టర్ కొడుకు ఒక మూవీలో కూడా నటించాడు. సోషల్ మీడియాలో వీళ్లకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఐతే వీళ్ళ క్రేజ్ ని కొందరు కాష్ చేసుకుంటున్నారు. డిజిటల్ టెక్నాలజీ పెరిగాక ఆన్లైన్ మోసాలు చాలా భారీగానే జరుగుతున్నాయి. ప్రొడక్ట్స్ ప్రమోషన్ పేరుతో ఆ దందా మరీ ఎక్కువైపోయింది. ఫేమస్ సెలెబ్స్ ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళతో ప్రమోట్ చేయిస్తున్నారు. ఇంకొందరు మోసం చేసి డబ్బు సంపాదిస్తున్నారు. శేఖర్ మాస్టర్ కూతురు సాహితి పేరుతో కొందరు మోసానికి పాల్పడుతున్నారు.

తన కూతురు సాహితి పేరు మీద కొన్ని ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేసి బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తామంటూ మెసేజెస్ పంపించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే విషయం శేఖర్ మాస్టర్ దృష్టికి వచ్చేసరికి ఆయన ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోని రిలీజ్ చేశారు. “మీ బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తాను అంటూ కొన్ని ఫేక్ అకౌంట్స్ నా కూతురి పేరుపై క్రియేట్ చేసి మెసేజ్లు పెడుతున్నారట. ప్రమోషన్ కోసం డబ్బును తీసుకుని తర్వాత రెస్పాండ్ కావడం లేదు. దయచేసి అలాంటివి నమ్మకండి .. నా కూతురుకు ఉండే ఐడి ఇదే ..నా కూతురు ఐడిని నేను ఫాలో అవుతున్నాను. మిగతా ఉన్నవి ఫేక్ అకౌంట్ నా కూతురుకి సంబంధించినవి కాదు. ఫేక్ ఐడీతో కొలాబరేట్ అవకండి " అని చెప్పి తన కూతురు ఒరిజినల్ ఇన్స్టా ఐడీని పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.