English | Telugu
గుంపులో నటించను.. అలాంటి పార్టీలకు వెళ్ళను
Updated : Nov 5, 2023
యాంకర్ అనసూయ ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉంటుంది. ఆమె తన కెరీర్ లో దూసుకుపోతోంది. జబర్దస్త్ కామెడీ షో తో స్మాల్ స్క్రీన్ మీద పాపులారిటీ తెచ్చుకున్న అనసూయ ప్రస్తుతం మూవీస్ తో ఫుల్ ఫామ్ లో ఉంది. రంగస్థలం, పుష్ప, రీసెంట్ గా వచ్చిన విమానం మూవీస్ ఆమె రేంజ్ ని పూర్తిగా మార్చేశాయి. ఇక అనసూయ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ రకరకాల కామెంట్లు చేస్తూ ఎప్పుడూ లైం లైట్ లో ఉంటూనే ఉంటుంది. అలాగే హాట్ హాట్ ఫొటోస్ ని షేర్ చేస్తూ ట్రోలింగ్‌కు గురవుతూ ఉంటుంది. అలాంటి అనసూయ రీసెంట్ గా చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీలో ఆయన పక్కన నటించే ఛాన్స్ వస్తే వదులుకున్న విషయం చెప్పింది అనసూయ. అత్తారింటికి దారేది మూవీలో స్పెషల్ సాంగ్‌లో పవన్ పక్కన డ్యాన్స్ చేసే అవకాశం వస్తే గుంపులో గోవిందా అన్నట్టుగా ఐపోతానేమో అని తాను ఆ సాంగ్ లో నటించలేను అని త్రివిక్రమ్ కి కూడా చెప్పానంది అనసూయ. గుంపులో నటించడం ఇష్టం ఉండదు ఎందుకంటే తనకు ఎప్పుడు అందరిలోకి స్పెషల్ గా ఉండాలని అనుకుంటుందట. అందుకే ఆ పాటకు నో చెప్పానని.. ఆ టైంలో తనపై చాలా విమర్శలు వచ్చినా పట్టించుకోలేదని అనసూయ చెప్పింది. తానెప్పుడూ స్ట్రెయిట్ ఫార్వర్డ్ అని, ఐతే త్రివిక్రమ్‌కి సారీ చెప్పినట్టు అనసూయ తెలిపారు. షూటింగ్స్‌లో తన పని తానూ చూసుకుని వెళ్లిపోతానని చెప్పింది. మూవీ షూటింగ్స్ అయ్యాక జరిగే పార్టీలకు దూరంగా ఉండడం వల్లనే తాను హీరోయిన్ అవకాశాలను కోల్పోయినట్లు చెప్పింది. అనసూయ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.