English | Telugu

విజయ్‌ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్‌’ సంక్రాంతికి లేనట్టే!

విజయ్‌ దేవరకొండ, పరశురామ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘గీత గోవిందం’ ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మరో డిఫరెంట్‌ మూవీ ‘ఫ్యామిలీ స్టార్‌’. ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని భావించారు నిర్మాత దిల్‌రాజు. ఈరోజు వరకు సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల్లో విజయ్‌ దేవరకొండ ‘ఫామిలీస్టార్‌’ పేరు కూడా వినిపించింది. అయితే తాజా సమాచారం మేరకుఈ సినిమా సంక్రాంతికి విడుదల కావడం లేదని తెలుస్తోంది...