English | Telugu
డీప్ ఫేక్ వీడియోపై రష్మిక ఎమోషనల్ కామెంట్స్!
Updated : Nov 27, 2023
ఇటీవల హీరోయిన్ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సహా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు రష్మికకు అండగా నిలిచారు. ఇక తాజాగా ఈ ఫేక్ వీడియో అంశంపై రష్మిక ఎమోషనల్ కామెంట్స్ చేసింది.
రణబీర్ కపూర్, రష్మిక జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన సినిమా 'యానిమల్'. ఈ యాక్షన్ థ్రిల్లర్ డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా మీడియా నుంచి డీప్ ఫేక్ వీడియోకి సంబంధించిన ప్రశ్న ఎదురు కాగా, రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
"ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. అందరికీ జరుగుతుంది. అమితాబ్ గారు నాకు ఫస్ట్ సపోర్ట్ చేశారు. ఆ తర్వాత సౌత్, నార్త్ నుంచి ఎందరో సపోర్ట్ చేశారు. ఇది సాధారణ విషయం కాదు. మనం చూసీ చూసీ చిన్న విషయంలా కనిపిస్తుంది. మనం రియాక్ట్ అయినా ఎవరైనా పట్టించుకుంటారా అనే అభిప్రాయం ఏర్పడింది. కానీ ఇండస్ట్రీలో అందరూ రియాక్ట్ అవ్వడం చూసి.. ఇది నార్మల్ కాదు, మనం రియాక్ట్ అవ్వాల్సిన విషయమని అర్థమైంది. నేను గర్ల్స్ అందరికీ ఒకటే చెప్పాలి అనుకుంటున్నాను. ఏదైనా మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తుంది అనుకుంటే సైలెంట్ గా ఉండకండి. రియాక్ట్ అవ్వండి, మీకు మద్దతుగా అందరూ వస్తారు" అని రష్మిక చెప్పుకొచ్చింది.