English | Telugu

ఏంటి నితిన్ ఇది.. మరీ ఇంత విధ్వంసమా!

నితిన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ మీద నితిన్ అభిమానులు చాలా ఆశలే పెట్టుకున్నారు. ఇటీవల వచ్చిన టీజర్ తో ఈ చిత్రం అయినా తమ అభిమాన హీరోని వరుస పరాజయాల నుంచి కాపాడుతందనే నమ్మకంతో నితిన్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఆశలు నూటికి నూరుపాళ్లు నిజమయ్యేలా ఒక క్రేజీ న్యూస్ నితిన్ అభిమానుల్లో ఫుల్ జోష్ ని తెచ్చిపెట్టింది.

కొద్దీ సేపటి క్రితం నితిన్ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ ట్రైలర్ రిలీజ్ అయింది..రిలీజ్ అయ్యింది అనడం కంటే మున్ముందు ఎన్నో సంచలనాలు సృష్టించడానికి సిద్ధం అయ్యిందని చెప్పవచ్చు. నితిన్ వన్ మాన్ షో గా తెరకెక్కుతున్న ఈ మూవీ ట్రైలర్ ని చూస్తుంటే టైటిల్ కి తగ్గట్టే నితిన్ ఎంతో ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు. నితిన్ చేసే కామెడీ కూడా ఒక లెవెల్లో ఉంది. తన తండ్రి రావు రమేష్ తో అలాగే విలన్స్ అయిన మిర్చి సంపత్ తో, సుదేవ్ నాయర్ తో నితిన్ సూపర్ గా కామెడీని పంచాడు. అలాగే ట్రైలర్ చివరలో సీనియర్ నటుడు రాజశేఖర్ చెప్పిన ఒక డైలాగ్ తో విపరీతమైన కామెడీ మూడ్ లో కి ఆడియెన్స్ వచ్చారు. ట్రైలర్ ద్వారానే ఇంత ఫన్నీ పండిందంటే ఇక సినిమా మొత్తం కామెడీ ఏ లెవెల్లో ఉంటుందో అని నితిన్ అభిమానులు ఫ్యాన్స్ ఇప్పటినుంచే అంచనాలు వేసుకుంటున్నారు.

శ్రేష్ట్ మూవీస్ అండ్ రుచిరా ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ఎన్ సుధాకర్ రెడ్డి ,నిఖితా రెడ్డి లు అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో నితిన్ సరసన శ్రీలీలే ఆడిపాడనుంది. ఈ సినిమా ద్వారా వక్కంతం వంశీ పెన్నుకిఅలాగే తనదర్శకత్వ ప్రతిభకి ఎంత పదును ఉందో చెప్పబోతున్నాడు .హారిస్ జైరాజ్ సంగీత సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ డిసెంబర్ 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో అడుగుపెట్టబోతున్నాడు.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.