English | Telugu
ప్రభాస్ ఫ్యాన్స్ కోసం సలార్ షర్ట్స్
Updated : Nov 27, 2023
ప్రభాస్ ఫాన్స్ తో పాటు భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న మూవీ సలార్. డిసెంబర్ 22 న రాబోతున్న ఈ మూవీ మీద అంచనాలు పిక్ లో ఉన్నాయి. ఇండియా మొత్తం మీద ప్రతి నలుగురు కలిసినప్పుడల్లా సలార్ గురించే చర్చ జరుగుతుందంటే సలార్ ప్రేక్షకుల మనుషుల్లో ఎంతగా నాటుకొని పోయి ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు సలార్ టీం ప్రభాస్ ఫాన్స్ కోసం ఒక గుడ్ న్యూస్ ని చెప్పింది.
ప్రభాస్ అంటేనే ఒక స్టైల్. కొన్ని లక్షల మంది అభిమానులు ప్రభాస్ స్టైల్ ని ఫాలో అవుతుంటారు. ప్రభాస్ లాగా హెయిర్ స్టైల్ అండ్ డ్రెస్ లని ధరించే ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. ఇప్పుడు అలాంటి అభిమానుల కోసం ప్రత్యేకంగా సలార్ టీ షర్ట్స్ వచ్చాయి. సలార్ పేరు రాసి ఉన్న షర్ట్స్ రక రకాల కలర్స్ లో లభ్యమవుతున్నయి. 499 రూపాయిల నుంచి 1499 రూపాయిల దాకా ఆ షర్ట్స్ అందుబాటులో ఉన్నాయి .ప్రభాస్ అభిమానులు హోంబలే వెర్సెస్ వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చెయ్యవచ్చు. అలాగే టీ షర్ట్స్ తో పాటు హుడి ,హార్మ్ స్లీవ్స్ ని కూడా ఆ సైట్ నుంచి పొందవచ్చు.
డిసెంబర్ 22 దగ్గరపడే కొద్దీ మేకర్స్ సలార్ ప్రమోషన్స్ ని ఒక రేంజ్ లో స్టార్ట్ చెయ్యనున్నారు. అందులో భాగంగా మొదట భారీ ఎత్తున ఒక భారీ ఈవెంట్ ని జరపబోతున్నారు. అలాగే ఇండియాలోని పలు ప్రధాన నగరాల్లో సలార్ ఈవెంట్ లు కూడా జరగనున్నాయి. వాటితో పాటుగా ప్రభాస్ అన్ని బాషల మీడియా ప్రతినిధులతో మాట్లాడతాడు. ఇక పోతే ప్రస్తుతం ఇండియా మొత్తం సలార్ ఫీవర్ తో ఉంది. ఈ ఫీవర్ తగ్గాలంటే సలార్ రిలీజ్ ఒక్కటే మార్గం.