English | Telugu
హీరో మహేష్.. అందుకే సూపర్‌స్టార్ మహేష్ అయ్యాడు!
Updated : Nov 27, 2023
ప్రతి హీరోకీ అభిమానులు ఉంటారు. అయితే వారి వారి రేంజ్‌ని బట్టి అభిమానులు ఉంటారు. ముఖ్యంగా టాప్ హీరోల అభిమానుల గురించి చెప్పక్కర్లేదు. తమ అభిమాన హీరో కనిపిస్తే చాలు.. సెల్ఫీలు అంటూ బయల్దేరతారు. ఈ విషయంలో హీరోలు, హీరోయిన్లు చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఒక్కోసారి వారికి కూడా సెల్ఫీలు తీయించుకునేందుకు వచ్చేవారిపై కోపం వస్తుంది. అభిమానులపై చిరాకు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో టాప్ హీరోలే కాదు, చిన్నా చితకా నటులు కూడా సెల్ఫీల కోసం వచ్చే అభిమానులపై విసుగును ప్రదర్శిస్తారు. వారిని తిటిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అభిమానులంటే ఎక్కువగా గౌరవం ఇచ్చే హీరో సూపర్‌స్టార్ కృష్ణ. అభిమానులతో ఎంతో ఓపికగా మాట్లాడుతూ వారు చెప్పినవన్నీ వినేవారు కృష్ణ. ఇప్పుడు కృష్ణ తనయుడు మహేష్‌బాబు తండ్రి నుంచి నట వారసత్వాన్ని అందుకోవడమే కాదు, అభిమానుల పట్ల ఆయన చూపించే గౌరవాన్ని కూడా వారసత్వంగా పొందాడు. ఈ విషయాన్ని లైవ్‌లో చూపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇటీవల ‘గుంటూరు కారం’ చిత్రానికి సంబంధించిన ఓ పాట చిత్రీకరణ జరిగింది. ఈ పాటలో వందల మంది డాన్సర్లు పాల్గొన్నారు. షూటింగ్ పూర్తయిన తర్వాత డాన్సర్స్ అందరికీ తనతో సెల్ఫీ తీసుకునేందుకు అనుమతి ఇచ్చాడు. 200 మందికి పైగా ఉన్న డాన్సర్‌తో ఎంతో ఓపికగా ఫోటోలు దిగారు సూపర్‌స్టార్. తనను అభిమానించే వారి కోసం దాదాపు రెండు గంటలపైనే నిలబడి అందరికీ తనతో ఫోటో దిగే అవకాశం ఇచ్చాడు.