English | Telugu

నందమూరి హీరోతో 'దిస్ ఈజ్ లేడీ రోజ్' అంటున్న బాలీవుడ్ బ్యూటీ!

వైవిధ్య‌మైన సినిమాల‌ను చేస్తూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న టాలీవుడ్ హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌. ఆయ‌న క‌థానాయ‌కుడిగా నటిస్తోన్న లేటెస్ట్ పీరియాడిక్ స్పై థ్రిల్ల‌ర్ ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న అభిషేక్ నామా తానే దర్శకుడిగా కూడా వ్యవహరిస్తుండటం విశేషం.

ఇటీవల విడుదలైన ‘డెవిల్’ మూవీ టీజర్‌, ‘మాయ చేశావే..’ సాంగ్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో మేకర్స్ ఈ సినిమా నుంచి ‘దిస్ ఈజ్ లేడీ రోజ్..’ అనే లిరికల్ వీడియోను సెకండ్ సాంగ్‌గా రిలీజ్ చేశారు. ఈ పాటను ‘జవాన్’ చిత్రంలో టైటిల్ ట్రాక్‌తో ఆకట్టుకున్న లేటెస్ట్ సింగింగ్ సెన్సేషన్ రాజకుమారి పాడటం విశేషం. ఆమె ఎనర్జిటిక్ వాయిస్ పాటకు మరింత ఎట్రాక్షన్‌గా మారింది.

హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత సారథ్యం వహించిన డెవిల్ సినిమాలో ‘దిస్ ఈజ్ లేడీ రోజ్..’ పాటకు శ్రీహర్ష ఇమాని సాహిత్యాన్ని అందించారు. బాలీవుడ్ బ్యూటీ ఎల్నాజ్ నొరౌజీ ఈ పాటలో అప్పియరెన్స్, డాన్స్ మూమెంట్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటలో కళ్యాణ్ రామ్ లుక్ కూడా ఆకట్టుకుంది. ఈ సాంగ్ థియేటర్స్‌లో ఆడియెన్స్‌కి కళ్లకు విందులా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.

శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే అందించారు. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీత సార‌థ్యం వ‌హిస్తుండ‌గా సినిమాటోగ్రాఫ‌ర్‌గా సౌంద‌ర్ రాజ‌న్, ప్రొడక్షన్ డిజైనర్ గా గాంధీ నడికుడికర్, ఎడిట‌ర్‌గా త‌మ్మిరాజు వ్యవహరిస్తున్నారు.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.