ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది.. పీవీపీపై నెటిజన్లు ఫైర్!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. అధికార పార్టీ బీఆర్ఎస్ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ ని దాటేసి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కాంగ్రెస్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే సినీ నిర్మాత, వైసీపీ నాయకుడు ప్రసాద్ వి పొట్లూరి మాత్రం అత్యుత్సాహానికి పోయి, తెలంగాణ ఎన్నికల ఫలితాలపై వెటకారం చేయబోయి తానే విమర్శల పాలయ్యాడు.