English | Telugu
మరోసారి నితిన్ సాక్షిగా సుమ,బ్రహ్మాజీల వీరంగం
Updated : Dec 5, 2023
యాంకర్ సుమ,నటుడు బ్రహ్మాజీలు ఒక చోట కలిశారంటే ఇక వాళ్లిద్దరు ఒకరి మీద ఒకరు వేసుకునే పంచులు మాములుగా ఉండవు.కొన్ని సార్లు వాళ్ళిద్దరి పంచులు అక్కడ ఉన్న వాళ్ళందరిని విపరీతంగా నవ్విస్తే కొని సార్లు ఆ పంచులు వేరే అర్దాలకి దారి తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా వాళ్ళిద్దరి మధ్య జరిగిన కొన్ని డైలాగులు సోషల్ మీడియాలో పలు చర్చలకి దారి తీస్తున్నాయి.
ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ టీం తమ మూవీ ప్రమోషన్లో భాగంగా ప్రముఖ ఛానెల్ లో ప్రసారమయ్యే సుమ అడ్డా షో కి వెళ్లారు. ఆ సినిమా హీరో నితిన్ దర్శకుడు వక్కంతం వంశీలతో పాటు నటులు బ్రహ్మాజీ ,హైపర్ అది పాల్గొన్నారు.ఈ షోలో బ్రహ్మాజీ చేస్తున్న అల్లరిని ఉద్దేశించి మీరు మరీ తింటున్నారు అని సుమ అనగానే వెంటనే బ్రహ్మాజీ సుమకి రివర్స్ పంచ్ లో నేను స్నాక్స్‌లానే తింటున్నాను అండి అంటూ కౌంటర్ వేస్తాడు. అలాగే మరో సందర్భంలో సుమ బ్రహ్మాజీతో తిన్నారా విన్నారా అంటే హా తిన్నాను భోజనాలు ఎప్పుడు అని బ్రహ్మాజీ అంటాడు. కేవలం ఈ డైలాగ్స్ వరకే కాకుండా ఇద్దరు కలిసి జయం సినిమా స్పూప్ ని కూడా చేసారు.
సదా పాత్రలో ఉన్న సుమతో భోజనాలు ఎఫ్పుడు పెడతారు పోనీ స్నాక్స్ అయినా ఎప్పుడు పెడతారు అని బ్రహ్మాజీ అడుగుతాడు.అప్పుడు సుమ వెళ్లవయ్యా వెళ్లు వెళ్లు అని సదా స్టైల్లో అంటుంది. అప్పుడు బ్రహ్మాజీ అందుకే కదా మొన్న అంటూ సుమకి అంతకు ముందు జరిగిన ఒక వివాదాన్ని గుర్తు చేయబోతాడు. ఇలా తను వేసే కౌంటర్లకి బ్రహ్మాజీ రివర్స్ కౌంటర్స్ వేస్తుండటంతో ఒకానొక సందర్భంలో సుమ తెల్లమొహం కూడా వేస్తుంది. ఇదంతా చూస్తు ఉన్న నితిన్ నవ్వుతుంటాడు.అలాగే నితిన్ తన ట్విట్టర్లోను ఆ వీడియోను షేర్ చేశాడు. సోషల్ మీడియాలో సుమ బ్రహ్మాజీల వీడియో చూస్తున్న వాళ్ళు మరీ అంత డబుల్ మీనింగ్ డైలాగ్స్ అయితే ఎలా అని అనుకుంటున్నారు.