English | Telugu
బన్నీ ఫాన్స్ కి గుడ్ న్యూస్
Updated : Dec 5, 2023
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ పుష్ప 2 షూటింగ్ లో నిర్విరామంగా పాల్గొంటున్నాడు. ఇప్పటికే అరవై నుంచి డెబ్భై శాతం వరకు షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సుకుమార్ శరవేగంగా షూటింగ్ ని జరుపుతున్నాడు. తాజగా ఈ మూవీకి సంబంధించిన గుడ్ న్యూస్ ఒకటి బన్నీ అభిమానుల్లో జోష్ ని తెస్తుంది.
పుష్ప 2 సినిమాలోని సాంగ్ ఒకదాన్ని నెక్స్ట్ వీక్ లో షూట్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సాంగ్ ని దేవి శ్రీప్రసాద్ సూపర్ గా కంపోజ్ చేసాడని అలాగే చంద్రబోస్ కూడా పుష్ప లోని సాంగ్స్ ని మించే విధంగా పుష్ప 2 లోని అన్ని పాటలకి సాహిత్యాన్ని అందించాడని అంటున్నారు. ప్రస్తుతం టాకీ పార్ట్ ని పూర్తిచేసుకుంటున్న ఈ మూవీ మీద పాన్ ఇండియా వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
పుష్ప ని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళే ఈ పుష్ప 2 ని నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఫాహద్ ఫాజిల్, అనసూయ, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.సుమారు 500 కోట్ల బడ్జట్ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ప్రఖ్యాత హాలీవుడ్ కెమరామెన్ మీరోస్లావ్ కూబా బ్రోజెక్ పుష్ప 2 కి ఫొటోగ్రఫీ బాధ్యతలని నిర్వహిస్తున్నారు