English | Telugu
మొత్తం నాదే..జీవితాకి అంత లేదంటున్న రాజశేఖర్
Updated : Dec 5, 2023
తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో హీరోయిన్లుగా నటించి ఆ పై పెళ్లి చేసుకున్న జంటల్లో జీవిత,రాజశేఖర్ ల జంట కూడా ఒకటి. ఎన్నో సినిమాల్లో హిట్ పెయిర్ గా నిలిచిన ఇద్దరు నిజ జీవితంలో కూడా హిట్ పెయిర్ నే.1991 వ సంవత్సరంలో వీరిద్దరి వివాహం జరిగింది. అప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా చిలకా గోరింకల్లాగా కలిసి మెలిసి జీవిస్తున్నారు. కానీ నిన్న తమ మధ్య ఉన్నఒక సీక్రెట్ ని రాజశేఖర్ బయటపెట్టడంతో ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది.
రాజశేఖర్ తాజాగా నితిన్ హీరోగా వస్తున్న ఎక్సట్రా ఆర్డినరీ మాన్ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. నిన్న ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో పాల్గొన్న రాజశేఖర్ మాట్లాడుతు చాలా మంది ఈ సినిమా ట్రైలర్ లో ఉన్న నా డైలాగ్ చూసి నిజ జీవితంలో జీవిత చెప్పినట్లు రాజశేఖర్ వింటాడని అందరు అనుకుంటున్నారు. కానీ నేను చెప్పిందే జీవిత వింటుంది. వంశీ ఎందుకు ఆ డైలాగ్ రాశాడో తెలియదు. అలాగే మా సంసారం ఇప్పటిదాకా ఎలాంటి గొడవలు లేకుండా సాగడానికి ప్రధాన కారణం అప్పుడప్పుడు జీవిత చెప్పిన మాటలు కూడా వింటు ఉండటమే అని కూడా రాజశేఖర్ చెప్పుకొచ్చాడు.
ఎక్సట్రా ఆర్డినరీ మాన్ ట్రైలర్ లో రాజశేఖర్ తన క్యారక్టర్ ప్రకారం నేను జీవితంలో ఎవరు చెప్పింది వినను ఒక్క జీవితం తప్ప అని అంటాడు. అప్పుడు నితిన్ రాజశేఖర్ తో జీవితాన సర్ అని అనడంతో ఎండ్ అవుతుంది.ఈ వ్యాఖ్యలని ఉద్దేశించే రాజశేఖర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అసలు నిజం చెప్పుకొచ్చాడు. కానీ బయట ఎప్పటినుంచో రాజశేఖర్ జీవిత చెప్పిందల్లా వింటాడు, జీవిత చెప్పిందే చేస్తాడు అనే టాక్ ఉంది.పైగా ఇదే ప్రోగ్రామ్ లో రాజశేఖర్ గారు విలన్ గా చెయ్యడానికి కూడా సిద్ధం అని జీవిత చెప్పడం గమనార్హం.