English | Telugu
సినిమా కోసం దెబ్బలు తిన్న నటి
Updated : Dec 4, 2023
ఒకప్పటి అందాల నటి లిజి, వైరటీ చిత్రాల దర్శకుడు ప్రియదర్శన్ ల ముద్దుల కూతురు కళ్యాణి ప్రియదర్శిని..అఖిల్ అక్కినేని హీరోగా వచ్చిన హలో చిత్రం ద్వారా తెలుగు సినీ రంగానికి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తాజాగా తమిళంలో ఆంథోనీ అనే మూవీ చేసింది. మొన్న డిసెంబర్ 1 న విడుదల అయిన ఈ మూవీకి సంబంధించి తను పడిన కష్టాన్ని కళ్యాణి వివరించింది.
ఆంథోనిలో కళ్యాణి బాక్సర్ గా నటించింది. తన క్యారక్టర్ బాగా రావడం కోసం సినిమా షూటింగ్ కి ముందు కూడా కళ్యాణి బాక్సింగ్ ని బాగా ప్రాక్టీస్ చేసింది. ఆలాగే సినిమాలో బాక్సర్ క్యారక్టర్ లో కళ్యాణి రియల్ గానే దెబ్బలు తింది. ఇందుకు సంబంధించిన పూర్తి విషయాల గురించి కళ్యాణి తన ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఈ సినిమాలో నేను తిన్న పంచ్‌లు కిక్స్, రియల్ ,అలాగే కన్నీళ్లు కూడా నిజమే.కానీ రక్తం మాత్రం నిజం కాదు అని చెప్పింది. పైగా నేను సినిమాకి పడిన కష్టం మొత్తం థియేటర్స్ లో మీ చప్పట్లు అరుపులతో మర్చిపోయానని అలాగే ఈ సినిమా ప్రయాణంలో భాగంగా ఎంతో నేర్చుకున్నట్టుగా కూడా చెప్పుకొచ్చింది. కళ్యాణి తనకి దెబ్బలు తగిలిన పిక్స్ తో చెప్పిన ఈ విషయాలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అలాగే కంఫర్ట్ జోన్‌లో ఉన్నంత వరకు మనకు సినిమాల్లో ఎదుగుదల అనేది ఉండదనే విషయం కూడా తెలిసింది.మా సినిమా మీద ప్రేమను చూపిస్తున్న ప్రేక్షకులందరికీ థాంక్స్ అని కూడా కళ్యాణీ ప్రియదర్శన తెలిపింది. జోజు జార్జ్, కళ్యాణీ ప్రయదర్శన్ కాంబోలో ఈ ఆంథోనీ చిత్రం తెరకెక్కింది. జోష్లి దర్శకత్వాన్ని వహించాడు.