English | Telugu

నేను మీకేం అన్యాయం చేశాను.. నాపై ఎందుకింత ద్వేషం!

చీమ చిటుక్కుమంటే వెంటనే అది సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమవుతుంది. దానిపై కూడా కామెంట్స్‌ పెడుతూ నెటిజన్లు ఎంజాయ్‌ చేస్తుంటారు. ఇక సెలబ్రిటీలు ఏదైనా పొరపాటు చేస్తే ఊరుకుంటారా? ఉతికి ఆరేస్తారు. ఇప్పుడు అలాంటిదే సోషల్‌ మీడియలో చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్‌ నటి సురేఖావాణి గురించి అందరికీ తెలిసిందే. సినిమాల్లో మంచి క్యారెక్టర్లు చేస్తూనే సోషల్‌ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. తను ఇంపార్టెంట్‌ అనుకున్న ప్రతి మూమెంట్‌ని నెటిజన్లతో షేర్‌ చేసుకుంటుంది. ఆమెతోపాటు కూతురు సుప్రీత కూడా ఇప్పుడు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ అయిపోయింది. తల్లీకూతుళ్ళు ఇద్దరూ రీల్స్‌ చేస్తూ సందడి చేస్తుంటారు. అయితే కొన్ని వీడియోలకు వీరిపై విమర్శలు కూడా వచ్చాయి.

తాజాగా మరోసారి సురేఖావాణి, సుప్రీత వార్తల్లో నిలిచారు. నెటిజన్లు వీరిద్దరినీ ట్రోల్‌ చేస్తూ ఇబ్బంది పెట్టేస్తున్నారు. అసలు జరిగిందేమిటంటే.. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించిన నేపథ్యంలో కౌంటింగ్‌ జరిగిన రోజే వీరిద్దరూ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తూ అతనితో ఫోటో దిగారు. దాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇక అప్పటి నుంచి వారిపై ట్రోలింగ్‌ మొదలైంది. ఎందుకంటే ఈ ఎన్నికల ముందు కారు ముందు నిలబడి బీఆర్‌ఎస్‌ గెలవాలని రీల్స్‌ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌ గెలిచిన తర్వాత రేవంత్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు. దీని ఆధారంగా తల్లీకూతుళ్ళను విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. ఇది సురేఖావాణి కూతురు సుప్రీతను ఎంతో బాధించిందట. అందుకే సోషల్‌ మీడియాలో తన బాధను వ్యక్తం చేసింది. ‘ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో నన్ను ట్యాగ్‌ చేసి మరీ వేధిస్తున్నారు. మొదట నేను బీఆర్‌ఎస్‌కు సపోర్ట్‌ చేసిన మాట నిజమే. కాంగ్రెస్‌ విజయం సాధించిన తర్వాత కొత్త సీఎంకి శుభాకాంక్షలు తెలిపాను. ఇంత మాత్రానికే నన్ను ట్రోల్‌ చేయడం సరికాదు. నేను మీకేం అన్యాయం చేశాను? నాపై ఎందుకింత ద్వేషం? మీరు చేస్తున్న ట్రోలింగ్‌ నా మానసిక ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపిస్తుందో తెలుసా?’ అంటూ పోస్ట్‌ పెట్టింది. ఇప్పుడీ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.