తికమకతాండ.. ఆ ఊర్లో అందరికీ మతిమరుపే!
ఆ ఊర్లోని ప్రజలందరికీ మతిమరుపు అనే ఒక కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన 'తికమకతాండ' చిత్రం డిసెంబర్ 15న విడుదలకు సిద్ధమవుతోంది. ట్విన్స్ హరికృష్ణ, రామకృష్ణ హీరోలుగా యాని, రేఖ నిరోషా హీరోయిన్లుగా వెంకట్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా ప్రొడ్యూసర్స్ సి. కళ్యాణ్, దామోదర్ ప్రసాద్, ప్రసన్నకుమార్ వచ్చి మూవీ టీం కి అభినందనలు తెలిపారు.