English | Telugu
అక్కడ నాని హాయ్ నాన్న రికార్డు
Updated : Dec 9, 2023
నాచురల్ స్టార్ నాని హీరో గా వచ్చిన నయా మూవీ హాయ్ నాన్న. డిసెంబర్ 7 న వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ మూవీ విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుపోతుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా నాని,మృణాల్ ఠాకూర్ కియారాల నటనకి ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఫిదా అవుతున్నాడు.రిపీటెడ్ ఆడియన్స్ కూడా పెరిగిన ఈ మూవీ కి సంబంధించిన తాజా న్యూస్ ఒకటి నాని అభిమానుల్లోను ఇండస్ట్రీ వర్గాల్లోను జోష్ ని నింపుతుంది.
హాయ్ నాన్న మూవీ యుఎస్ లోని నాని గత చిత్రాల కంటే రికార్డు స్థాయి కలెక్షన్స్ ని రాబట్టింది. యుఎస్ లో ఇప్పటికే 500k అంటే హాఫ్ మిలియన్ డాలర్స్ ని కొల్లగొట్టింది. అలాగే మంచి హిట్ టాక్ పొందటంతో మరిన్ని కలెక్షన్స్ ని కూడా సాధిస్తుందని యుఎస్ లో డిస్ట్రిబ్యూట్ చేసిన సంస్థ పేర్కొంది. ఈ హాయ్ నాన్న యుఎస్ ప్రేక్షకులకి అంతగా నచ్చడానికి ప్రధాన కారణం.మూవీ చాలా స్టైలిస్ట్ గా ఉండటంతో పాటుగా తండ్రి కూతురు సెంటిమెంట్ కి బాగా కనెక్ట్ అవుతున్నారు అలాగే మృణాల్ మెర్చ్యుడ్ నటన కూడా సూపర్ గా ఉండటంతో యుఎస్ ప్రేక్షకులు హాయ్ నాన్న కి బ్రహ్మరధం పడుతున్నారు. కాగా తమ మూవీకి యుఎస్ లో మంచి రెస్పాన్స్ వస్తుండటంతో మేకర్స్ చాలా ఆనందంగా ఉన్నారు.
కొత్త దర్శకుడు శౌర్యువ్ దర్శత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో హీరోయిన్ శృతి హాసన్ ఒక సాంగ్ లో మెరవగా ప్రియదర్శన్, జయరాం, నాజర్, లు కీలక పాత్రలు పోషించారు. హేషం అబ్దుల్ వాహబ్ సంగీతం అందించగా వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చెరుకూరి మోహన్, విజేందర్ రెడ్డి. మూర్తిలు నిర్మాతలుగా వ్యవహరించారు.