English | Telugu

పాన్ ఇండియా మూవీ.. రవితేజ స్థానంలో బాలీవుడ్ స్టార్!

'డాన్ శీను', 'బలుపు', 'క్రాక్' సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని నాలుగోసారి చేతులు కలిపారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా రూపొందించాలని ప్లాన్ చేశారు. అయితే రవితేజకు పాన్ ఇండియా మార్కెట్ లేదు. ఆయన మార్కెట్ తో పోలిస్తే సినిమా బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుండటంతో.. మేకర్స్ ఈ ప్రాజెక్ట్ కి బ్రేకులు వేశారు. అయితే ఇప్పుడు ప్రాజెక్ట్ లోకి రవితేజ స్థానంలో బాలీవుడ్ యాక్టర్ సన్నీ డియోల్ వచ్చినట్లు తెలుస్తోంది.