English | Telugu

తికమకతాండ.. ఆ ఊర్లో అందరికీ మతిమరుపే!

ఆ ఊర్లోని ప్రజలందరికీ మతిమరుపు అనే ఒక కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన 'తికమకతాండ' చిత్రం డిసెంబర్ 15న విడుదలకు సిద్ధమవుతోంది. ట్విన్స్ హరికృష్ణ, రామకృష్ణ హీరోలుగా యాని, రేఖ నిరోషా హీరోయిన్లుగా వెంకట్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా ప్రొడ్యూసర్స్ సి. కళ్యాణ్, దామోదర్ ప్రసాద్, ప్రసన్నకుమార్ వచ్చి మూవీ టీం కి అభినందనలు తెలిపారు.

ప్రొడ్యూసర్ సి. కళ్యాణ్ మాట్లాడుతూ.. "తికమకతాండతో దర్శకుడుగా పరిచయం అవుతున్న వెంకట్ కి ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అలాగే ట్విన్స్ టెక్నీషియన్స్ గా వచ్చి హీరోలుగా ఎదిగింది ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్. కానీ డైరెక్ట్ గా ఈ ట్విన్స్ రామ్, హరి ఇద్దరూ హీరోలుగా తెలుగ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. అలాగే హీరోయిన్లు యాని, రేఖ నిరోషా అందరూ చాలా కష్టపడి సినిమాను మన ముందుకు తీసుకొస్తున్నారు. టి ఎస్ ఆర్ మూవీ మేకర్స్ పైన తిరుపతి శ్రీనివాసరావు గారు ఎంతో కష్టపడి వెంకట్ ని నమ్మి సినిమాని నిర్మించారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. చిన్న సినిమా బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది. చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా మంచి సినిమాగా ఆదరించి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా" అన్నారు.

ప్రొడ్యూసర్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. "సినిమా ట్రైలర్ చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. టిఎస్ఆర్ మూవీ మేకర్స్ పై తిరుపతి శ్రీనివాస్ గారు నిర్మించిన ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని నమ్ముతున్నాను. వెంకట్ చాలా కష్టపడే వ్యక్తి. కొంచెం టైం పట్టింది దర్శకుడుగా రావడానికి కానీ కష్టానికి తగిన ప్రతిఫలం కచ్చితంగా ఉంటుంది. ఈ సినిమా తనకి మంచి సక్సెస్ అవ్వాలని అవుతుందని కోరుకుంటున్నా" అన్నారు.

ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. "తికమకతాండ ఈ టైటిలే చాలా విచిత్రంగా అనిపించింది. టైటిల్ బేస్ చేసుకుని సినిమాలు హిట్ అయినవి ఉన్నాయి. ఇది కూడా అలాంటి కోవలోకే చెందుతుంది. వెంకట్ దర్శకత్వంలో వస్తున్న తికమకతాండా మూవీ కచ్చితంగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్న. అలాగే హీరోలు హరికృష్ణ, రామకృష్ణ హీరోయిన్స్ యాని, రేఖా నిరోషాకి మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. ఈ రోజున చిన్న సినిమా పెద్ద సినిమ అని లేదు ఒక మంచి సినిమా మాత్రమే. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించి మంచి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను" అన్నారు.

డైరెక్టర్ వెంకట్ గారు మాట్లాడుతూ.. "ముందుగా ఈ కథ ప్రొడ్యూసర్ తిరుపతి శ్రీనివాస రావు గారికి చెప్పినప్పుడు ఆయన ఒకటే చెప్పారు.. నేను నా కొడుకులు కోసమే ఈ సినిమా తీయడానికి రెడీ అవుతున్నాను అన్నారు. హీరోలు హరికృష్ణ రామకృష్ణకి స్టొరీ బాగా నచ్చడంతో ఈ సినిమా మొదలైంది. హరికృష్ణ, రామకృష్ణ, యాని, రేఖ అందరూ బాగా సపోర్ట్ చేశారు. శివన్నారాయణ గారు, రాకెట్ రాఘవ, యాదమ రాజు, భాస్కర్ ప్రతి ఒక్కరు క్యారెక్టర్ కూడా చాలా హైలెట్ గా ఉంటుంది. నేను ఏదో పెద్ద తోపు సినిమా తీశానని చెప్పను ఒక మంచి సినిమా తీశాను అని అయితే కచ్చితంగా చెప్పగలను. ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా" అన్నారు.

ప్రొడ్యూసర్ తిరుపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. "మా ఈవెంట్ కి సపోర్ట్ చేయడానికి వచ్చిన సి. కళ్యాణ్ గారికి, దామోదర్ ప్రసాద్ గారికి, ప్రసన్న కుమార్ గారికి కృతజ్ఞతలు. చాలా కష్టపడి ఈ సినిమా తీశాం. తెలుగు ప్రేక్షకులు మా ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం" అన్నారు.

హీరోయిన్ రేఖ నిరోషా మాట్లాడుతూ.. "ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన వెంకట్ గారికి, ప్రొడ్యూసర్ తిరుపతి శ్రీనివాస్ రావు గారికి ధన్యవాదాలు. నా కోస్టార్స్ హరికృష్ణ, రామకృష్ణ, యాని తో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ మూవీ మా అందరికీ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా" అన్నారు.

హీరోయిన్ యాని మాట్లాడుతూ.. "నా చిన్నతనం నుండి సినిమాలు చేస్తున్నా. నా లైఫ్ లో నాకు మర్చిపోలేని చిత్రం రాజన్న. ఆ సినిమా లో అవకాశం ఇచ్చిన విజయేంద్రప్రసాద్ గారికి, నాగార్జున గారికి కృతజ్ఞతలు. నేను ఈ స్థాయిలో ఉండడానికి నా తల్లిదండ్రులే కారణం వారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఇప్పుడు హీరోయిన్ గా ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన వెంకట్ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా మా టీం అందరికీ మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా" అన్నారు.

హీరోలు హరికృష్ణ, రామకృష్ణ మాట్లాడుతూ.. "ఈ సినిమా మా దగ్గర డబ్బు ఉంది కదా అని తీయలేదు. సినిమా మీద మాకు ఉన్న ప్యాషన్ తో చేసాం. మా నాన్నగారు మాతో ఈ సినిమా నేను మీకు ఒక స్టెప్పింగ్ లాగే చూపిస్తున్నా, మీ కష్టంతో మీరు పైకి ఎదగాలి అని చెప్పారు. ఆయన మాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెడతాం అలాగే మా బ్యానర్ పేరుని కూడా నిలబెడతాం" అన్నారు.

సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి డీఓపీగా హరికృష్ణన్, ఎడిటర్ గా కుమార్ నిర్మలాసృజన్ వ్యవహరిస్తున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .