English | Telugu

గుజరాత్ సముద్ర తీరంలో చిక్కుకున్న నాగ చైతన్య.. వెళ్లిన నాగ్, వెంకీ  

అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. నవ యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా హిట్ ట్రాక్ లో పయనిస్తున్న దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తండేల్ మూవీ ఈ రోజు ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో అట్టహాసంగా ప్రారంభం అయ్యింది.నాగ చైతన్య సినీ కెరీర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా మూవీగా తండేల్ తెరకెక్కుతుండటంతో అక్కినేని అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక్కో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.అలాగే ఈ మూవీ ఓపెనింగ్ కి వచ్చిన ఇద్దరు అతిధుల విషయంలో కూడా అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.

ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్, బన్నీ వాసులు కలిసి తండేల్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఓపెనింగ్ కి చై తండ్రి నాగార్జున తో పాటు చై మేనమామ వెంకటేష్ హాజరయ్యి చిత్ర యూనిట్ ని అభినందించారు.సాయి పల్లవి చై తో జోడికట్టనున్న ఈ సినిమాలో చై మొట్టమొదటి సారిగా ఫుల్ మాస్ పాత్రల్లో నటించబోతున్నాడు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళానికి చెందిన ఒక మత్స్యకారుడు సముద్రంలో చేపల వేటకి వెళ్లి గుజరాత్ సముద్ర తీరంలో చిక్కుకుంటాడు. అతని జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కబోతుంది. అన్నపూర్ణ స్టూడియోలో అట్టహాసంగా ప్రారంభం అయ్యిన ఈ మూవీకి తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన అతిరధ మహారధులందరు హాజరయ్యి చిత్ర యూనిట్ కి తమ శుభాకాంక్షలని అందచేశారు.

చై ప్రస్తుతం దూత వెబ్ సిరీస్ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఆ సిరీస్ లో చై నటనని చుసిన ఫ్యాన్స్ ప్రేక్షకులు పరిశ్రమ వర్గాలందరు కూడా అక్కినేని నట వారసత్వానికి ఉన్న పవర్ ని మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ తండేల్ మూవీ కూడా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకంతో వారందరు ఉన్నారు.అలాగే దర్శకుడు చందు మొండేటి కార్తికేయ 2 తో అగ్ర దర్శకుడుగా మారాడు. పాన్ ఇండియా లెవెల్లో కార్తికేయ 2 సంచలన విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .