English | Telugu
ఫస్ట్ టైం బిగ్ స్క్రీన్ మీద ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ లో నేహా చౌదరి!
Updated : Dec 8, 2023
ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ ని ఫుల్ హుషారెత్తిస్తోంది. ఈ మూవీ కొంచెం కన్ఫ్యూషన్ గా ఉన్నా ఓవరాల్ గా కామెడీగా చాల బాగుంది అనే టాక్ ని సొంతం చేసుకుంది. ఐతే ఈ మూవీలో ఫస్ట్ టైం చిన్న రోల్ చేసింది నేహా చౌదరి. ఇక ఆమె ఆనందానికి అంతే లేకుండా పోయింది..తన ఆనందాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది. "డేంజర్ పిల్లా ఇక్కడ ఉంది!!!! సినిమాలో నేను చేసినది చాలా చిన్న పాత్ర!!!
ఫస్ట్ టైం బిగ్ స్క్రీన్ మీద కనిపించాను !!! ఈ అవకాశం ఇచ్చిన అలాగే మరపురాని జ్ఞాపకాలను అందించినందుకు ధన్యవాదాలు ..ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్" అంటూ ఒక టాగ్ పెట్టుకుంది. ఐతే ఈ మూవీలో నటించిన రాజశేఖర్ ఐజీ విజయ్ చక్రవర్తిగా నటించారు. ఆయన టీమ్ లో ఒక సభ్యురాలిగా నేహా కనిపించింది. ఇక ఇన్స్టాగ్రామ్ లో కూడా అదే గెటప్ లో ఒక వీడియో చేసి పోస్ట్ చేసింది. ఈమధ్య బుల్లితెర మీద వాళ్లంతా సిల్వర్ స్క్రీన్ మీద తళుక్కున చిట్టి చిట్టి క్యారెక్టర్స్ లో మెరిసిపోతూ ఫుల్ ఫేమస్ అవుతున్నారు.
నిన్న గాక మొన్న "జవాన్" మూవీలో మన బుల్లితెర నటి సిరి హన్మంత్ చిన్న పోలీస్ రోల్ లో కనిపించింది ఇప్పుడు అలాంటి ఒక రోల్ లో నేహా కూడా కనిపించింది. ఇంతకు ఈ మూవీ మధ్యలో వచ్చే ఐజీ విజయ్ చక్రవర్తి (రాజశేఖర్) పాత్ర ఏమిటి ? ఆయన టీమ్ లో నేహా రోల్ ఏమిటి అనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఇక నేహా కూడా వాళ్ళ పేరెంట్స్ ని తీసుకెళ్లి ఆ మూవీని చూసి ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది అంటూ ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది. అందరూ పగలబడి నవ్వుకున్నారని కూడా చెప్పింది.