English | Telugu

సలార్ రెండు వారాలే అంటున్న ఆ హీరో ఫ్యాన్స్..సోషల్ మీడియాలో ప్రకంపనలు

ఇప్ప్పుడు ఇండియా మొత్తం సలార్ మానియా ప్రారంభం అయ్యింది. రెబల్ స్టార్ ప్రభాస్ అండ్ ప్రశాంత్ నీల్ ల ఫస్ట్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రేక్షకులు కూడా అంతే ఇదిగా ఎదురుచూస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ప్రభాస్ ఫ్యాన్స్ లో జోష్ నింపడంకోసం సలార్ ఇంకో వంద రోజుల్లో రాబోతుందనే పోస్టర్ ని చిత్ర బృందం విడుదల చేసింది. తాజాగా సోషల్ మీడియాలో సలార్ గురించి వస్తున్న ఒక న్యూస్ సంచలనం సృష్టిస్తుంది.

సలార్ ఇంక కేవలం రెండు వారాల్లో మన ముందుకు రాబోతుందంటూ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రకరకాలుగా పోస్ట్ లు పెడుతూ ప్రభాస్ పై తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.ట్రైలర్ తో సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయని అలాగే ట్రైలర్ రికార్డు వ్యూస్ తో ముందుకు దూసుకెళ్తుందని రేపు విడుదలయ్యే సాంగ్ తో ఇక జనం థియేటర్ల దగ్గరికి అడ్వాన్సు బుకింగ్ కోసం పరుగులు తీస్తారని అంటున్నారు. అలాగే ఆన్ లైన్ బుకింగ్ కూడా నిము షాల వ్యవధిలోనే క్లోజ్ అయిపోతుందని కూడా అంటున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎంతో అతృతతో ఎదురుచూస్తున్నామని కూడా అంటున్నారు.

కేజిఎఫ్ సిరీస్ తో ఇండియన్ సినిమాకి ఒక కొత్త రకం మార్కుని ప్రశాంత్ నీల్ క్రియేట్ చేస్తే బాహుబలి సినిమాతో ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కే ఒక కొత్త రకం మార్క్ ని ప్రభాస్ క్రియేట్ చేసాడు. ఇప్పుడు వీళ్ళద్దిరి కాంబోలో వస్తున్న సలార్ ఇండియన్ సినిమా కి సరికొత్త సవాలు విసరటం ఖాయమని సినీ ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. డిసెంబర్ 22 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న సలార్ లో ప్రభాస్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడనే మాటలు వినపడుతున్నాయి. కానీ మేకర్స్ ఆ విషయాన్నీ ఎక్కడ అధికారకంగా ప్రకటించటలేదు. రేపు సినిమా విడుదలయ్యాక గాని అసలు నిజం తెలియదు.