English | Telugu

'డెవిల్' కోసం 90 కాస్ట్యూమ్స్‌ను ఉప‌యోగించిన కళ్యాణ్ రామ్!

విభిన్న చిత్రాలతో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న నంద‌మూరి హీరో క‌ళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘డెవిల్. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ద‌ర్శ‌క నిర్మాత‌గా ఈ సినిమాను రూపొందించాడు. డిసెంబ‌ర్ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదొక పీరియడ్‌ డ్రామా. బ్రిటీష్‌వారు ఇండియాను ప‌రిపాలించిన కాలానికి సంబంధించిన క‌థ‌తో తెర‌కెక్కిన సినిమా కావ‌టంతో నాటి ప‌రిస్థితుల‌ను ఆవిష్క‌రించేలా భారీగా సినిమాను చిత్రీక‌రించారు. అలాగే న‌టీన‌టులకు సంబంధించిన వ‌స్త్రాలంక‌ర‌ణ భార‌తీయ‌త‌ను ప్ర‌తిబింబించేలా ఉంటుంది.