English | Telugu
మహేష్ బాబు కి గ్లోబల్ స్థాయి ఇమేజ్ లేదు...కానీ ఇది గ్రేట్ కదా అంటున్న ఫ్యాన్స్!
Updated : Dec 9, 2023
నెట్ ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సెరండోస్ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకి చెందిన అగ్ర హీరోలందరిని కలుస్తున్నారు. చిరంజీవి ,రామ్ చరణ్, ఎన్టీఆర్ లని కలిసిన ఆయన తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు ని కలిశారు.ఈ సందర్భంగా సోషల్ మీడియాలో మహేష్ ఫ్యాన్స్ చేస్తున్న కొన్ని కీలకమైన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.
నెట్ ఫ్లిక్స్ సీఈఓ మహేష్ బాబు ని కలవడంతో మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ లు కలిసి నటించిన ఆర్ ఆర్ఆర్ సినిమా నేషనల్ వైడ్ గా విడుదల కావటంతో చరణ్ ఎన్టీఆర్ లకి మంచి గుర్తింపుని పొందారని అలాగే ఆస్కార్ ని సైతం ఆ సినిమా పొందటంతో కూడా బాగా పాపులర్ అయ్యారు. కానీ మా మహేష్ నుంచి ఎలాంటి గ్లోబల్ స్థాయి మూవీ రాకపోయినా కూడా నెట్ ఫ్లిక్స్ సీఈఓ మా సూపర్ స్టార్ మహేష్ ని మీట్ అవ్వడం తమకి చాలా సంతోషంగా ఉందని మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని తెలియచేస్తున్నారు. మహేష్ కూడా తన ట్విట్టర్ వేదికగా నెట్ ఫ్లిక్స్ సీఈఓ ని కలవడంపై తన ఆనందాన్ని వ్యక్తం చేసారు.
మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం మూవీ ని చేస్తున్నాడు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల కాబోతుంది. మహేష్ సరసన శ్రీలీల ,మీనాక్షి చౌదరి హీరోయిన్లు గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తుండగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.