English | Telugu
నిన్న రామ్‌చరణ్, నేడు ఎన్టీఆర్.. నెట్‌ఫ్లిక్స్ టార్గెట్ ఏమిటి?
Updated : Dec 8, 2023
నెట్‌ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సరాండోస్ డిసెంబర్ 7న మెగాస్టార్ ఫ్యామిలీని కలిసిన విషయం తెలిసిందే. చిరంజీవి నివాసానికి వెళ్లి అక్కడ చిరుతోపాటు రామ్‌చరణ్, సాయిధరమ్‌తేజ్, వైష్ణవ్‌తేజ్‌లను కలిసి వారితో కాసేపు గడిపారు. డిసెంబర్ 8 మధ్యాహ్నం యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను అతని నివాసంలోనే కలిశారు టెడ్ సరాండోస్. నెట్‌ఫ్లిక్స్ సీఈవో.. ఎన్టీఆర్‌ని కలిసిన సమయంలో నందమూరి కళ్యాణ్ రామ్, కొరటాల శివ ఉన్నారు. ఎన్టీఆర్, టెడ్ ఇద్దరూ సినిమాలకు సంబంధించిన అనేక విషయాల గురించి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత టెడ్‌తోపాటు నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధులతో కలిసి ఎన్టీఆర్ బృందం లంచ్ చేశారు
అనంతరం ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘టెడ్‌ని కలవడం, వారి టీమ్‌తో కలిసి లంచ్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది’ అన్నారు. టెడ్ మాట్లాడుతూ ‘ఎన్టీఆర్‌తో గడిపిన ఈ క్షణాలు మరచిపోలేనివి. మా ఇద్దరి మధ్య సినిమాల గురించి, ఇతర విషయాల గురించి ఆసక్తికరమైన చర్చ జరిగింది’ అన్నారు.