English | Telugu

రేవంత్ రెడ్డిని ఉద్దేశించి రామ్ చరణ్ సంచలన ట్వీట్!

తెలుగు సినిమా పరిశ్రమకి రాజకీయాలకి ఎప్పటినుంచో అనుబంధం ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా వారికి పలువురు సినిమా హీరోలు కంగ్రాట్స్ చెప్తుంటారు.అలాగే మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.ఎంతో మంది సినిమా ప్రముఖులు రేవంత్ రెడ్డి కి అబినందనలు తెలిపారు.ఈ కోవలో ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా చేరాడు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

రామ్ చరణ్ తాజాగా తన ట్విట్టర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంతి రేవంత్ గారికి నా ధన్యవాదాలు. మీ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి సానుకూల మార్పులని మరియు శ్రేయస్సును తీసుకురావాలని కోరుకుంటున్నాను అని రామ్ చరణ్ తెలిపాడు. ఇప్పుడు ఈ విషయం సంచలనంగా మారడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే రామ్ చరణ్ అండ్ గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన కల్వకుంట తారకరామారావు (కేటిఆర్) లు మంచి స్నేహితులు. ఈ విషయాన్ని స్వయంగా కేటిఆరే ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. చరణ్ కూడా కేటిఆర్ ని తన సొంత అన్నలాగా భావిస్తాడు.అలాగే చరణ్ కి సంబంధించిన ఎన్నో సినిమాల ఫంక్షన్స్ కి కేటిఆర్ హాజరయ్యి తన దీవెనలని కూడా చరణ్ ని అందించేవాడు.దీంతో ఇప్పుడు చరణ్ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి కి శుభాకాంక్షలు చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ విషయాన్ని సోషల్ మీడియాలో చూసిన కొంత మంది సినిమా హీరో లు ముఖ్యమంత్రిని మంచి చేసుకోవడానికి కంగ్రాట్స్ చెప్తుంటారని అంటుండగా మెగా ఫ్యాన్స్ మాత్రం మంచి చేసుకోవడం కాదు అలా దన్యవాదాలు తెలపడం మా చరణ్ యొక్క సంస్కారం అని అంటున్నారు. చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. దిల్ రాజు ఆ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.