English | Telugu

ఇంత వయసొచ్చినా ఇదేం పని అంకుల్...జర్నలిస్ట్ పై రేణు దేశాయ్ ఫైర్

మూవీ ఇండస్ట్రీలో రేణు దేశాయ్ కి ఒక మంచి పేరుంది..ఆమె చాలా డిసిప్లిన్ గా, డిగ్నిటీగా ఉంటారు. అలాంటి రేణు దేశాయ్ మీద సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మడి రామారావు కామెంట్స్ చేశారు. ఈ మధ్య ఆయన ఎక్కువగా రేణు దేశాయ్ ని టార్గెట్ చేస్తూ ఇంటర్వ్యూస్ లో ఆమె పేరును ఎక్కువ సార్లు ప్రస్తావిస్తున్నారు. తన పేరు పలికిన కొన్ని క్లిప్స్ ని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు రేణు దేశాయ్. ఒక ఇంటర్వ్యూలో ఆయన కేవలం 7 నిమిషాల్లోనే 13 సార్లు తన పేరును ప్రస్తావించారంటూ చెప్పారు. రేణుదేశాయ్ ఆ సీనియర్ జర్నలిస్టుకి తనదైన శైలిలో ఘాటుగానే సమాధానమిచ్చారు.

సింగిల్ ఉమెన్ గా తన ప్రత్యేకతలన్నిటిపై ఒక పోస్ట్ పెట్టారు. "సుమారు 30 యాడ్స్ లో నటించాను. తెలుగు, తమిళంలో కలిపి మూడు సినిమాలు చేశాను. తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ ని నేనే. స్కూల్, కాలేజీలో నేనొక మెరిట్ స్టూడెంట్ ని. టీవీ షోలో సక్సెస్ఫుల్ జడ్జి. సక్సెస్ఫుల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉమెన్ ని..కథా రచయిత్రి, డైరెక్టర్ ని..యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్ ని ... ఇలాంటి ఘనతలు సాధించిన నా గురించి... ఎవరో తెలియని ఓ వ్యక్తి నా జీవితంలో నేను ఏం చేయాలో చెబుతున్నాడు" అంటూ అతనిపై ఫైర్ అయింది రేణు దేశాయ్. "అంకుల్ మీరు నా నామస్మరణం చేసిచేసి వ్యూస్ సంపాదిస్తున్నారు.

నా పేరు వల్ల మీకు డబ్బులు వస్తున్నాయంటే నాకు సంతోషం. కానీ సింపుల్ గా చైర్ లో కూర్చుని ఫిలిం యాక్టర్స్ గురించి గాసిప్స్ చెబుతూ డబ్బులు సంపాదించడం కంటే నీ ఓన్ టాలెంట్, ఎక్స్పీరియన్స్ తో నువ్వు డబ్బులు సంపాదిస్తే అది చాలా బాగుంటుంది. అంకుల్, మీ ఈ సమయాన్ని సేవా కార్యక్రమాలకు ఉపయోగించండి లేకుంటే ఆ దేవుడి నామస్మరణ చేయండి. ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా మీ అనుభవం ఇలా ఉందంటే జాలేస్తోంది. అంకుల్, నేనెప్పుడూ మిమ్మల్ని కలవలేదు. నా గురించి మీకేం తెలీదు. కానీ నా గురించి ఇంటర్వ్యూలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మహిళలు దుర్గాదేవి, కాళీమాత వంటి శక్తివంతులని భావించే మన కల్చర్ లో మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్లు వేస్ట్ అంటూ మీలాంటి వాళ్ళు ఇలాంటి కబుర్లు నూరిపోసి ఈ సొసైటీకి నేర్పిస్తున్నారు" అంటూ మరో పోస్టులో రాసుకొచ్చింది రేణు దేశాయ్.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.