ఆగస్ట్ 19 న ముగ్గురు విడుదల
ఆగస్ట్ 19 న ముగ్గురు విడుదల కానుందని ఈ చిత్రం యూనిట్ తెలిపింది. వివరాల్లోకి వెళితే ప్రతిష్టాత్మక సినీ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై, నవదీప్, అవసరాల శ్రీనివాస్, "హ్యాపీడేస్" ఫేం రాహుల్ హీరోలుగా, రీమాసేన్, శ్రద్ధా దాస్, సంజన, సౌమ్య హీరోయిన్లుగా, నాగేంద్ర.వి.ఆదిత్య (వి.యన్.ఆదిత్య) దర్శకత్వంలో, మూవీ మొగల్ డాక్టర్ డి.రామానాయుడు నిర్మిస్తున్న పూర్తి వినోదాత్మక చిత్రం "ముగ్గురు".