English | Telugu

సునీల్ సెట్ లో ప్రభాస్ సినిమా

సునీల్ సెట్ లో ప్రభాస్ సినిమా అంటే వినటానికే ఏదోగా ఉంది కదా...! విషయమేమిటంటే యంగ్ రెబెల్ స్టార్‍ ప్రభాస్ హీరోగా, ప్రముఖ సినీ రచయిత కొరటాల శివని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ప్రభాస్ సన్నిహితులు తొలిసారిగా నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ కోకా పేట్ లో జరుగుతూంది. అయితే ఇక్కడ గతంలో సూనీల్ హీరోగా, ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో నిర్మించబడి, సూపర్ హిట్టయిన "మర్యాదరామన్న" చిత్రం కోసం వేసిన హౌస్ సెట్ అలాగే ఉంది.

ఆ ఇంటి సెట్ ని కొద్దిగా మార్చ్ అక్కడే గత వారం రోజులుగా ప్రభాస్ సినిమా షుటింగ్ జరుపుతున్నారు. గతంలో అనేక మంది సినీ రచయితలు దర్శకులుగా మారారు. వారిలో కొందరు విజయవంతమైన దర్శకులు కాగా మరికొంతమంది కనుమరుగయ్యారు. మరి కొరటాల శివ ఏ కోవకు చెందిన దర్శకుడో తెలియాలంటే ఈ చిత్రం విడుదల వరకూ ఆగాల్సిందే. దీంతో పాటు లారెన్స్ దర్శకత్వంలో ప్రభాస్ "రెబెల్" అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.