English | Telugu

"వీడింతే"లో విక్రమ్ 17 గెటప్స్

పి.వి.పి.సినిమా పతాకంపై, పరమ్ వి.పొట్లూరి సమర్పణలో, చియాన్ విక్రమ్ హీరోగా, దీక్షాసేథ్ హీరోయిన్ గా, కళా తపస్వి డాక్టర్ కె.విశ్వనాథ్ ఒక ముఖ్య పాత్రలో నటించగా, రీమాసేన్, శ్రియ శరణ్, సలోనీ కొన్ని పాటల్లో నటించగా, "నా పేరే శివ" ఫేం సుసీంద్రన్ దర్శకత్వంలో, ప్రసాద్ వి.పొట్లూరి నిర్మిస్తున్న చిత్రం" వీడింతే". క్యాప్షన్ "బై బర్త్" అని నిర్ణయించారు. ఈ చిత్రాన్ని నిజానికి తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. తమిళంలో ఈ చిత్రానికి "రాజు పాట్టై"అన్న పేరుతో విడుదల చేస్తారు.

ఈ చిత్రంలో హీరో విక్రమ్ మొత్తం 17 గెటప్స్ లో ప్రేక్షకులకు కనువిందు చేయనున్నారు. ఇంతవరకూ మన దేశంలో ఇన్ని గెటప్స్ మన దేశంలో ఏ హీరో కూడా వేసిన దాఖలాలు లేవు. ఈ ఘనత హీరో విక్రమ్ కు మాత్రమే దక్కింది. ఈ గేటప్స్ కొన్ని ఒక పాటలో కొన్ని సెకన్లు పాటు, మరికొన్ని గెటప్స్ కొన్ని నిమిషాల పాటు కనిపిస్తాయని స్వయంగా హీరో విక్రమే మీడియాకు తెలియజేశారు.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.