English | Telugu

చెర్రీ సినిమాలో గెస్ట్ గా బన్నీ

చెర్రీ సినిమాలో గెస్ట్ గా బన్నీ నటించనున్నాడట. వివరాల్లోకి వెళితే చెర్రీ అదేనండి రామ్ చరణ్ తేజ హీరోగా, దిల్ రాజు సమర్పణలో, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో, గంటా శ్రీనివాస్ నిర్మిస్తున్న సినిమా "వాడే" (ఈ పేరు ఇంకా అఫీషియల్ గా నిర్ణయించలేదు). ఈ చిత్రం డిసెంబర్ 9 వ తేదీన, ఉదయం 7 గంటలకు, హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా ప్రారంభం కానుంది.

ఈ చిత్రంలో ప్రముఖ యువ హీరో అల్లు అర్జున్ ఓ అరగంట పాటు అతిథి పాత్రలో నటించనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఇదెంత వరకూ నిజమో చెప్పలేము. ఈ సినిమాలో డైలాగ్ కింగ్ సాయి కుమార్ నెగెటీవ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తున్నారట. బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "పంజా" చిత్రం విడుదల రోజునే అబ్బాయ్ రామ్ చరణ్ సినిమా ప్రారంభం కావటం మెగా అభిమానులకు సంతోషం కలిగించే విషయం.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.