English | Telugu

దీక్షా సేథ్ ని ర్యాగింగ్ చేసిన విక్రమ్

హీరోయిన్ దిక్షా సేథ్ తొలి సారిగా ఒక తమిళ చిత్రంలో నటిస్తూంది. ఆ చిత్రం ఏమిటంటే పి.వి.పి.సినిమా పతాకంపై, పరమ్ వి.పొట్లూరి సమర్పణలో, చియాన్ విక్రమ్ హీరోగా, దీక్షాసేథ్ హీరోయిన్ గా, కళా తపస్వి డాక్టర్ కె.విశ్వనాథ్ ఒక ముఖ్య పాత్రలో నటించగా, రీమాసేన్, శ్రియ శరణ్, సలోనీ కొన్ని పాటల్లో నటించగా, "నా పేరే శివ" ఫేం సుసీంద్రన్ దర్శకత్వంలో, ప్రసాద్ వి.పొట్లూరి నిర్మిస్తున్న చిత్రం" వీడింతే.

డిసెంబర్ 7 వ తేదీన, హైదరాబాద్ తాజ్ డక్కన్ లో, ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ చేతుల మీదుగా తొలి సి.డి.ని మరో ప్రముఖ దర్శకుడు రాజమౌళి అందుకోగా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో వేల్ రికార్డ్స్ ద్వారా మార్కెట్లోకి విడుదల చేయబడింది.

ఈ "వీడింతే" ఆడియో విడుదల వేడుకలో హీరో విక్రమ్ ప్రసంగిస్తూ దిక్షా సేథ్ తొలిసారిగా తమిళ చిత్రంలో నటించటం వల్ల ఆమెను తమ చిత్రం యూనిట్ అంతా ర్యాగింగ్ చేశారనీ, అయినా ఆమె చాలా కూల్ గా అవేవీ పట్టించుకోకుండా తన నటన మీదే ఏకాగ్రత చూపించటం తనకెంతో నచ్చిందనీ అన్నారు.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.