English | Telugu
విక్టరీ వెంకటేష్ ఆధ్యాత్మిక యాత్ర
Updated : Dec 7, 2011
ఈ మధ్య విక్టరీ వెంకటేష్ ఆధ్యాత్మిక యాత్ర చేశారు. చాలా మందికి వెంకటేష్ ఒక ప్రముఖ సినీ హీరోగానే తెలుసు. కానీ ఆయనలో ఉన్న మరో కోణం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. అది ఆధ్యాత్మక చింతన. నేను ఎవరు...? ఎక్కణ్ణించి ఇక్కడకు వచ్చాను...? ఎందుకొచ్చాను...? పోనీ దేనికో దానికి వచ్చాను...మరి ఇక్కణ్ణించి ఎక్కడకు వెళతాను...? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిస్తే ఈ సృష్టి రహస్యం, భగవంతుడి గురించి తెలిసినట్లే...! హీరో వెంకటేష్ నిరంతరం ఈ ధ్యాసలోనే ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే విక్టరీ వెంకటేష్ రాజయోగి.
అలాంటి వేంకటేష్ ఇటీవల మూడు వారాల పాటు ఆధ్యాత్మిక యాత్ర జరిపారు. ఆ యాత్రల భాగంగా హిమాలయాల సమీపాన మోడ్రన్ నేపాల్లో ఉన్న గౌతమ బుద్ధుడి జన్మస్థలం, ప్రతి బౌద్ధుడికీ అత్యంత ప్రథానమైన యాత్రాస్థలం లుంబినీకి వెళ్ళారు. అలాగే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అత్యంత ప్రాచీన ప్రథానమైన పుణ్యస్థలం కాశీకి ఈశాన్య దిశలో 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న సారనాథ్ కి వెళ్ళారు. ఇక్కడ గౌతమ బుద్ధుడు బౌద్ధ ధర్మాన్ని ప్రపంచానికి తెలియజెప్పారు. ఇలా ఈ మూడు వారాల్లో ఆయన అనేక అతి పవిత్ర పుణ్యక్షేత్రాలను సందర్శించుకున్నారు.