English | Telugu

13 భాషల్లో నిర్మాతగా నాయుడుగారు

మూవీ మొగల్ డాక్టర్ డి. రామానాయుడు గారు తెలుగు సినీ పరిశ్రమకు చేసిన సేవలు అపారం. ఆయన ప్రపంచంలోనే అత్యథిక చిత్రాలను నిర్మించిన నిర్మాతగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో తన పేరుని నమోదు చేసుకున్న శతాధిక చిత్రాలను నిర్మించిన ఏకైక ఘన నిర్మాత. అది పక్కన పెడితే ఆయన భారతీయ భాషలన్నింటిలో సినిమాలను నిర్మించారు. ఒక్క పంజాబీ భాషలో తప్ప. ప్రస్తుతం ఆలోటు కూడా పూర్తవబోతోంది.

2012 లో నాయుడుగారు పంజాబీ భాషలో నవనీత్ సింగ్‍ అనే దర్శకుడి దర్శకత్వంలో ఒక చిత్రాన్ని నిర్మించబోతున్నారు. దీంతో ఆయన 13 భారతీయ భాషల్లో సినిమాలు నిర్మించిన నిర్మాతగా పెరొందబోతున్నారు. అంతేకాదు ఇన్ని భాషల్లో సినిమాలు నిర్మించిన ఏకైక నిర్మాతగా కూడా ఆయన గిన్నీస్ బుక్ లోకి మరో సారి ఎక్కబోతున్నారు. హేట్సాఫ్ టు నాయుడుగారు...త్రీ ఛీర్స్ టు డాక్టర్.డి.రామానాయుడు గారు.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.