English | Telugu

ప్రిన్స్ మహేష్ బాబుపై ఐ.టి.దాడి

ప్రముఖ తెలుగు టాప్ హీరో ప్రిన్స్ మహేష్ బాబుపై ఐ.టి.దాడి జరిగిందట. డిసెంబర్ 8 వ తేదీన, సాయంత్రం ఫిలిం నగర్ లోని మహేష్ బాబు స్వగృహంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడి జరిపారట. ఈ దాడి జరగటానికి కారణం "దూకుడు" ఫంక్షన్ లో ఆ చిత్ర నిర్మాతలు "దూకుడు వంద కోట్లు వసూలు చేసిందని ప్రకటించటం ఒక కారణమైతే ఆ సినిమాకి మహేష్ బాబు పారితోషికం పది కోట్లన్న వదంతి మరో కారణంగా తెలుస్తుంది.

అంతే కాకుండా "బిజినెస్ మ్యాన్" చిత్రానికి పన్నెండు కోట్లు పారితోషికంగా తీసుకున్నాడన్న వార్త కూడా దీనికి ముఖ్యకారణంగా తెలుస్తుంది.మరి ఈ దాడిలో ఐ.టి.శాఖ అధికారులు ఏ మేరకు సఫలీకృతులయ్యారో తెలియరాలేదు. గతంలో "దూకుడు" చిత్ర నిర్మాతల ఇళ్ళపైనా, ఆఫీసు పైనా ఐ.టి.శాఖ దాడి జరిపిన సంగతి ప్రేక్షకులకు తెలిసిందే.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.