English | Telugu

"లవ్లీ" టాకీ పూర్తి

"ప్రేమ కావాలి" ఫేం ఆది హీరోగా, శాన్వి అనే కొత్తమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేస్తూ, ప్రముఖ పాత్రికేయుడు, "సుపర్ హిట్" సినీ వారపత్రిక అధినేత బి.ఎ.రాజు నిర్మిస్తున్న విభిన్న ప్రేమ కథా చిత్రం "లవ్లీ". ఈ "లవ్లీ" చిత్రం షూటింగ్ హైదరాబాద్ లోని రామానాయుడు స్టుడియోలో జరుగుతున్న సందర్భంగా, డిసెంబర్ 8 వ తేదీన ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న శాన్వి జన్మదినాన్ని ఈ చిత్రం యూనిట్ సభ్యుల నడుమ ఘనంగా జరిపారు.

ఈ వేడుకలో శాన్వి తన జన్మదిన కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా శాన్వి ప్రసంగిస్తూ ఈ జన్మదినం తనకు చాలా ప్రత్యేకమైనదనీ, బి.జయ గారి లాంటి డైనమిక్ దర్శకురాలి దర్శకత్వంలో, బి.ఎ.రాజు గారి వంటి నిర్మాత నిర్మిస్తున్న ఈ "లవ్లీ" చిత్రంతో తెలుగు తెరకు పరిచయం కావటం తన అదృష్టమనీ, అందుకు తాను వారికి కృతజ్ఞురాలిననీ అన్నారు. శాన్వి ఇంకా మాట్లాడుతూ హీరో ఆది చాలా సహకరించారనీ, కెమెరా మేన్ అరుణ్ కుమార్ తనకు బాగా సహాయ సహకారాలందించారనీ అన్నారు.

నిర్మాత బి.ఎ.రాజు ప్రసంగిస్తూ తమ "లవ్లీ" సినిమా అటు యూత్ నీ, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ నీ ఆకట్టుకునేలా లవ్లీగా ఉంటుందనీ అన్నారు. దర్శకురాలు బి.జయ ప్రసంగిస్తూ నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారంతో సినిమా లవ్లీగా వచ్చిందనీ, డిసెంబర్ 10 వ తేదీకి టాకి పార్ట్ పూర్తవుతుందనీ, సినిమాలోని మిగిలిన నాలుగు పాటలను చిత్రీకరించి, సినిమాని జనవరిలో విడుదల చేయనున్నామనీ అన్నారు.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.