బన్నీ గుర్రం పాటల తేది ఖరారు
అల్లు అర్జున్, శృతిహాసన్ జంటగా నటిస్తున్న "రేసుగుర్రం" చిత్ర ఆడియోను మార్చి14న విడుదల చేయనున్నారు. అయితే వేదిక వివరాలు ఇంకా అధికారికంగా ఖరారు చేయలేదు. శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్లో నల్లమలుపు బుజ్జి, వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వస్తుంది. వేసవి సెలవుల్లో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.