English | Telugu

ఏప్రిల్ లో వర్మ రాజశేఖర్ ల పట్టపగలు

చాలా కాలంగా ఘోర అపజయాలు తప్ప విజయాలు తెలియని హీరో రాజశేఖర్ తో రాంగోపాల్ వర్మ "పట్టపగలు" అనే చిత్రం తెరకెక్కిస్తున్నాడు. రాజశేఖర్ ప్రధాన పాత్రలో వర్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఏప్రిల్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. కూతురుని పట్టి పీడిస్తున్న క్షుద్ర శక్తులతో ఒక తండ్రి ఎలా పోరాడాడు? దానికోసం అతను ఏం చేసాడు? అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కినట్లు తెలుస్తోంది. మరి ఈ చిత్రమైన రాజశేఖర్ కు విజయం అందిస్తుందో లేదో చూడాలి.

అంతే కాకుండా వర్మ తెరకెక్కిస్తున్న "రౌడీ" సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తయ్యింది. త్వరలోనే విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. విష్ణుతో వర్మ మరో సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.