English | Telugu

హీరోపై నీతూ సంచలన కామెంట్లు

"గోదావరి" సినిమాలో సుమంత్ మరదలి పాత్రలో నటించిన నీతూచంద్ర హీరో రాజశేఖర్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. రాజశేఖర్ మందుకొట్టి, గన్ పట్టుకుని సెట్స్‌ కు వస్తారని, దానివల్ల తనకెంతో భయం వేస్తుంది. అందుకే అతనితో కలిసి ఏ సినిమాలోనూ నటించేందుకు ఒప్పుకోవడం లేదని నీతూ ట్విట్టర్ ద్వారా తెలిపింది. రాజశేఖర్ సెట్స్‌కి ఆలస్యంగా వస్తాడని, నటీనటులను భయపెట్టేందుకు గన్ కూడా తెస్తాడని పేర్కొన్నది. రాజశేఖర్‌తో కలిసి సినిమాలు చేయకపోయినప్పటికీ, అతగాడు పబ్లిక్ ఫిగర్ కాబట్టి ఈ విషయం ప్రజలకు తెలియాలని అందుకే దీన్ని హైలైట్ చేస్తున్నట్టు నీతూచంద్ర తెలిపింది. అంతే కాకుండా ఈ విషయాన్ని హీరో నాగార్జునకు చెప్తే...అలాంటి భయలేవి పెట్టుకోవద్దని ధైర్యం చెప్పాడని తెలిపింది. ప్రస్తుతం నాగ్ ఫ్యామిలీ నటిస్తున్న "మనం" సినిమాలో నీతూ నటిస్తుంది.

ఇదిలా ఉంటే... ఈ వార్త చదివిన వారందరికి కూడా ఇదొక పబ్లిక్ స్టంట్ లా అనిపిస్తుంది. ఎందుకంటే... రాజశేఖర్ తో ఒక్క సినిమా కూడా చేయని ఈ అమ్మడికి అతను సెట్స్ కి ఎలా వస్తాడో ఎలా తెలుసు? ఇది కేవలం ఈ అమ్మడు పబ్లిసిటీ కోసమే ఇలా మాట్లాడుతుందని టాక్. మరి దీనిపై రాజశేఖర్ ఎలా స్పందిస్తాడో చూడాలి. రాజశేఖర్ కంటే ముందుగా జీవిత ఎలా స్పందిస్తుందో మరి కొద్ది రోజుల్లోనే తెలియనుంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.