English | Telugu
ఐ షూటింగ్ లో జెడ్ మాత్రమే మిగిలిఉందట
Updated : Mar 3, 2014
విక్రమ్, అమీ జాక్సన్ జంటగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "ఐ". ఈ చిత్రం గురించి దర్శకుడు శంకర్..."నేను తీస్తున్న "ఐ" సినిమా ఎ నుంచి వై వరకు పూర్తయ్యింది. విక్రమ్ నటించాల్సిన సన్నివేశాలన్నీ పూర్తయ్యాయి. ఇక అమీజాక్సన్ పై ఓ పాటని తెరకెక్కించాల్సి ఉంది. ఆ పాటతో జెడ్ కూడా పూర్తవుతుంది. మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకోస్తాము" అని తెలిపారు.