English | Telugu
చందమామ హిట్టయితే సీక్వెల్ తీస్తారంట..!
Updated : Mar 5, 2014
ఎనిమిది విభిన్న కథలతో తెరకెక్కిన "చందమామ కథలు" చిత్రం ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఆడియో విడుదల చేసారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ..."ఇటీవలే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తుంది. మిక్కీ జే మేయర్ మంచి పాటలను అందించాడు. మేము సరికొత్తగా విడుదల చేసిన డిజిటల్ ఆన్ లైన్ ఫార్మట్ ఆడియో సక్సెస్ అయ్యింది. ఈ సినిమా సక్సెస్ ను బట్టి ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని ప్లాన్ చేస్తున్నాం. అందుకే ఈ సినిమాకు వాల్యుం 1 అని పెట్టాము" అని అన్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని చాణక్య బూనేటి నిర్మించారు. ఇందులో నరేష్, ఆమని, మంచు లక్ష్మీ, కృష్ణుడు, చైతన్య కృష్ణ, రిచా పనాయ్, కిషోర్ తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు.