English | Telugu
మరో బృందావనం సిద్ధం చేస్తున్న వంశీ
Updated : Mar 4, 2014
నాగార్జున, ఎన్టీఆర్ కలయికలో ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కబోతుంది. "ఎవడు" చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కనుంది. కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుందని సమాచారం. వంశీ చెప్పిన కథ నాగ్, ఎన్టీఆర్ లకు బాగా నచ్చడంతో వెంటనే ఒప్పేసుకున్నట్లు తెలిసింది.
వంశీ, ఎన్టీఆర్ కలయికలో వచ్చిన "బృందావనం" సినిమాలో తారక్ ను చాలా కొత్తగా చూపించాడు వంశీ. మరి ఈ తాజా చిత్రంలో ఎన్టీఆర్ ను కొత్త లుక్ లో చూపించడంతో పాటుగా, అభిమానులు కోరుకునే అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు, డైలాగ్స్ ఉండేలా ప్లాన్ చేసాడట వంశీ.
నాగార్జున కూడా ఇప్పటివరకు చేసిన "గ్రీకువీరుడు", "భాయ్" వంటి చిత్రాలు మాస్ పరంగా సరైన విజయాన్ని అందుకోలేకపోయాయి. అందుకే నాగార్జున ని ఇందులో మాస్ ఇమేజ్ పాత్రలో చూపించబోతున్నాడట వంశీ.
ఈ ప్రాజెక్ట్ కోసం వంశీ చాలా కేర్ తీసుకుంటున్నాడని తెలిసింది. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియనున్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం "రభస" చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.