English | Telugu
నేడే లెజెండ్ ఆడియో టీజర్ విడుదల
Updated : Mar 4, 2014
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాలయ్య "లెజెండ్" చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలను మార్చి 7న శిల్పకళా వేదికలో విడుదల చేయనున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర స్మాల్ ఆడియో టీజర్ ను ఈరోజు సాయంత్రం 6గంటలకు విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరో పోస్టర్ ను తాజాగా విడుదల చేసారు.
భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మార్చి 28న లేదంటే ఏప్రిల్ 4న "లెజెండ్"ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 14రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లో అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ కథానాయికలు. జగపతి బాబు విలన్ పాత్రలో మొదటిసారిగా నటిస్తున్నాడు.