English | Telugu

పాప కాదు మాష్టర్ పప్పా....అరేయ్ ఏంట్రా ఈ డైలాగ్స్ ...

సుమ అడ్డా షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి కొరియోగ్రాఫర్లు యశ్వంత్ - భూషణ్ , భాను - విజయ్ వచ్చారు. ఐతే ఈ షోలో సుమ ఎలాంటి గేమ్స్ ఆడించలేదు..అన్ని పంచ్ డైలాగ్స్ వేసింది, వేయించింది. ఈ షోలో "జానీ జానీ ఎస్ పాప" అనే ఇంగ్లీష్ రైమ్ ని డిస్ ప్లే చేసి పాడింది సుమ. ఐతే విజయ్ మాష్టర్ ఐతే "పాపను చూపియ్యండి" అన్నాడు సీరియస్ గా.. దానికి రిప్లైగ భాను మాష్టర్ "మాష్టర్ పాప కాదు పప్పా" అని సరిచేసాడు. అసలు షోస్ లో ఈ బూతులేంటో అర్ధం కావడమే లేదు. సరే ఇక తర్వాత బోర్డు మీద చిన్న చిన్న గుణకారాలు వేసి అందరినీ అడిగింది సుమ. వాళ్ళు కూడా చెప్పారు.

ఓంకార్ డాన్స్ షోలో కొత్త పోరి వర్తికా ఝా బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్

డాన్స్ ఐకాన్ సీజన్ 2 లో మెంటార్ ప్రకృతి కంటెస్టెంట్ బర్కత్ అరోరా ప్లేస్ లో నెక్స్ట్ వీక్ వర్తికా ఝా అనే డాన్సర్ ఆడియన్స్ ని తన డాన్స్ తో అలరించబోతోంది. ఇంతకు ఈమె ఎవరు ఆమె బయోగ్రఫీ ఏంటో చూద్దాం. వర్తికా ఝా ఉత్తర్ ప్రదేశ్ లోని సొన్ భద్రలో 8 ఏప్రిల్ 2000 లో పుట్టింది. తండ్రి అరవింద్ కుమార్ ఝా..రేణుసాగర్‌ లో ఉన్న హిండాల్కో కంపెనీలో ఆపరేటర్ గా చేస్తున్నారు. ఇక తల్లి పేరు కాంటా ఝా. వర్తికా ఝా బెస్ట్ కొరియోగ్రాఫర్ మాత్రమే కాదు మంచి నటి కూడా. 2018లో స్టార్ ప్లస్ డ్యాన్స్ రియాలిటీ షో డాన్స్ ప్లస్ సీజన్ 4 లో 2వ రన్నరప్‌గా నిలిచింది. అప్పటి నుండి ఆమె బెస్ట్ డాన్సర్ గా, బెస్ట్ కొరియోగ్రాఫర్ గా పేరుతెచ్చుకుంది.

ఆరియానా ఇలాంటిదా ? అష్షుని అంతలా హర్ట్ చేసిందా ?

ఫ్రెండ్స్ మధ్య ఎప్పుడన్నా ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే అప్పటికప్పుడే క్లియర్ చేసుకోవాలి. లేదంటే ఆ బాధ ఎన్నాళ్లయినా, ఎంతమంది చెప్పిన అది పోదు. ఇప్పుడు ఆరియానా, అష్షు మధ్య జరిగింది అదే. ఫామిలీ స్టార్స్ షో వేదికగా వీళ్ళ మధ్య ఉన్న గ్యాప్స్ అన్నీ బయట పడ్డాయి. "లాస్ట్ ఇయర్ నాకో హెల్త్ ఇష్యూ వచ్చింది. నేను ఒక ఫ్రెండ్ నుంచి ఎక్స్పెక్ట్ చేశాను అట్లీస్ట్ ఒక కాల్ చేస్తారేమో లేదంటే మా ఇంటికి వచ్చి నన్ను చూస్తారేమో అని చెప్పి..ఆ ఫ్రెండ్ ఎవరో కాదు ఆరియానానే... బాగున్నప్పుడు ఏ ఎదవన్నా వస్తాడు..బాలేనప్పుడే కదా రావాలి  " అని అష్షు తన మనసులో బాధను బయటపెట్టింది. " ఇన్ని రోజులు దీన్ని నీ మనసులో పెట్టుకున్నావా.. నేను కాల్ చేస్తే నీ హెయిర్ డ్రెస్సర్ రవి కాల్ తీసాడు. ఆంటీకి నేను మూడు నాలుగు సార్లు కాల్ చేశా. నేను మాట్లాడిస్తాను అన్నారు." అంటూ ఆరియానా ఫ్రస్ట్రేషన్ వ్యక్తం చేసింది.

Illu illalu pillalu : కళ్యాణ్ కోసం ప్రేమజంట.. స్వయంవరంలో భాగ్యం అతడిని దక్కించుకుంటుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియస్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -92 లో..... ప్రేమ ధీరజ్ లు కళ్యాణ్ ని వెతకడానికి బస్ లో వెళ్తారు. బస్ పడకతో ప్రేమ వాంథింగ్ చేసుకుంటుంది. అక్కడ పక్కనున్న బామ్మా ప్రేమ నాడీ పట్టుకొని చుస్తుంటే ఎందుకు ఆలా చూస్తున్నావని ప్రేమ అడుగగా.. నెల తప్పావేమోనని చూస్తున్నా కానీ ఇది ఆ వంథింగ్ కాదని బామ్మ అంటుంది. మరొకవైపు రామరాజు పేపర్ పట్టుకొని ఇంట్లోకి వస్తాడు. ఎందుకు ఇంత సంతోషం గా ఉన్నారని వేదవతి అడుగుతుంది. ఏం లేదు రేపు స్వయంవరం ఉంది. అక్కడికి అందరు పెళ్లి సంబంధం కోసం వస్తారు. మనం కూడా చందుని తీసుకొని వెళదామని రామరాజు అంటాడు.

Eto Vellipoyindhi Manasu : రామలక్ష్మిని చూసి శ్రీలత షాక్.. ఆ వేలంపాటలో గెలిచేదెవరంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో.... రామలక్ష్మి చీకట్లో ఒంటరిగా నడుస్తూ సీతాకాంత్ తనతో ఉన్న జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటుంది. సీతా సర్ వేరొకరిని పెళ్లి చేసుకొని ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడని అనుకుంటుంది. సీతాకాంత్ వచ్చి తనని పిలిచినట్లు నువ్వే నా రామలక్ష్మివి నాపై ఒట్టేసి చెప్పమని అన్నట్లు.. దాంతో రామలక్ష్మి నేనే నీ రామలక్ష్మిని అయితే ఏంటి పెళ్లి చేసుకున్నావ్ బాబు ఉన్నాడు.. మళ్ళీ ఎందుకు నా దగ్గరికి వచ్చావంటు అడిగినట్లు ఉహించుకుంటుంది.

Brahmamudi: సామంత్ బాడీపై రాజ్ ఫింగర్ ప్రింట్స్.. షాక్ లో దుగ్గిరాల కుటుంబం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -654 లో.....అనామిక తరుపున లాయర్ కావ్యని బోన్ లోకి పిలుస్తాడు. మీరు సామంత్ దగ్గరికి వెళ్లి వార్నింగ్ ఇచ్చారా అని అడుగగా.. ఇచ్చామని కావ్య అంటుంది. నిన్ను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చారు కదా అని లాయర్ అడుగుతాడు. ఇచ్చామని కావ్య అంటుంది. చూసారా తనే చెప్తుంది.. చంపేస్తామని తన భర్త బెదిరించాడు. అది అందరి ముందు జరగదు కాబట్టి తనే ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్లి చంపాడని అనామిక లాయర్ అటు తిప్పి ఇటు తిప్పి రాజ్ హత్య చేశాడని నిరూపించే ప్రయత్నం చేస్తాడు.

Karthika Deepam2 : పెళ్లిచూపుల్లో కార్తీక్ గురించి చెప్పేసిన జ్యోత్స్న.. షాక్ లో శివన్నారాయణ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -290 లో......జ్యోత్స్న, కార్తీక్ వాళ్ల దగ్గరికి వచ్చి రెస్టారెంట్ కి కస్టమర్స్ రాకుండా చేస్తానని చెప్పి వెళ్ళిపోతుంది. మరొకవైపు దాస్ దగ్గరికి డాక్టర్ వచ్చి చెక్ చేస్తాడు. మళ్ళీ ఏదైనా పేపర్ పై రాస్తున్నాడా అని అడుగుతాడు. ఏం లేదని స్వప్న, కాశీలు డాక్టర్ కి చెప్తారు. ఆ తర్వాత డాక్టర్ వెళ్ళిపోయాక బెడ్ కింద స్వప్నకి ఒక పేపర్ కన్పిస్తుంది. అందులో దీపం వెళుగుతున్నట్లు ఉండే బొమ్మ గీసి ఉంటుంది. మావయ్య గారు ఇది ఎందుకు రాసారని స్వప్న అంటుంది...