English | Telugu

ఎవరింట్లోకి తొంగి చూడొద్దు ..బుద్దిగా మీ పెళ్లాలతో కాపురం చేసుకోండి

ఈ వారం జబర్దస్త్ షో ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో మెసేజ్ ఓరియెంటెడ్ గా సాగింది. అందులోనూ ఇమ్ము వర్ష స్కిట్ లో ఆ మెసేజ్ ఇవ్వడం కనిపించింది. వర్షతో పాటు మరో ఇద్దరు లేడీ కమెడియన్స్ అలాగే ఇమ్ము, పండు, దుర్గారావు కలిసి ఈ స్కిట్ లో చేశారు. ఐతే దుర్గారావు వర్షను పెళ్లి చేసుకుంటాడు. ఇక వర్ష సిస్టర్స్ ని పండు, ఇమ్ము పెళ్లి చేసుకుంటారు. వాళ్లకు వాళ్ళ భార్యలు నచ్చరు. అలా ముగ్గురూ కూడా వర్ష మీదనే కన్నేశారు. ఐతే ఏమీ తెలియని దుర్గారావుకు వర్ష లాంటి మంచి భార్య వచ్చేసరికి పండు, ఇమ్ము కుళ్లిపోయి దుర్గారావును చంపేసి వర్షను పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. ఐతే ఇమ్ము మూడు విషయం కలిపినా బాటిల్స్ తెచ్చి మిగతా ఇద్దరికీ ఇస్తాడు. అలా ముగ్గురు తాగేసాక పండు, ఇమ్ము కూడా గొంతు పట్టుకుంటారు. ఐతే వర్ష ఎవరికీ తెలీకుండా పండుని, ఇమ్ముని వేసేయాలని వాళ్ళ బాటిల్స్ విషం కలిపేసింది. ఆ విషయం తెలుసుకున్న ఇద్దరూ షాకయ్యారు.

Illu illalu pillalu : గొప్పింటి వాళ్ళమంటూ భాగ్యం అబద్దపు మాటలు.. డౌట్ పడిన నర్మద!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -94 లో......రామరాజు కుటుంబం చందుకి మంచి సంబంధం దొరుకుందేమోనని స్వయంవరానికి వస్తారు. భాగ్యం కుటుంబం కూడా స్వయంవరానికి ఎవరైనా కోటీశ్వరులు వస్తారేమో చూద్దామని వస్తారు. స్వయం వరం లో భాగ్యం అందరి అబ్బాయిలని రిజెక్ట్ చేస్తుంది. చందు స్టేజ్ పైకి వెళ్లి తన గురించి చెప్తూ ఇంట్లో వాళ్ళను పరిచయం చేస్తాడు. నాకు కాబోయే పెళ్ళాం అందంగా ఉండాలంటూ నాకూ కోరికలు ఏం లెవ్వు కానీ నా పేరెంట్స్ ని వాళ్ల పేరెంట్స్ గా చూడాలని చందు చెప్తాడు.

Karthika Deepam2 : తల్లి దగ్గర జ్యోత్స్న కపటనాటకం.. తన ప్రాణధాత దీపే అని తెలుసుకున్న కార్తీక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -293 లో.... దశరథ్ అన్న మాటలు జ్యోత్స్న గుర్తుచేసుకుంటుంది. ఆ దాస్ ఎప్పుడైనా నిజం చెప్పేలా ఉన్నాడు.. ఇన్ని రోజులు చెప్పకుండా ఆపాగలిగానంటే అది నా లక్.. నిజం తెలిసేలోపు ఎలాగైనా దీపని చంపెయ్యాలని జ్యోత్స్న అనుకొని ఒకతనికి ఫోన్ చేసి మాట్లాడుతుంది. నేను చెప్పిన దగ్గరికి రా అంటూ మాట్లాడుతుంది. దీప ఇలా చెయ్యక తప్పడం లేదంటూ తనలో తను మాట్లాడుకుంటుంది. దీప కుబేర్ ఫోటో దగ్గర దీపం పెడుతుంది. ఆ దీపం ఆరిపోవడం తో దీప బాధపడుతుంటుంది. అది చూసిన కార్తీక్.. గాలికి పోయిందని సర్దిచెప్తాడు. దాంతో దీప మళ్ళీ దీపం పెడుతుంది.

Eto Vellipoyindhi Manasu : అమ్మని గుర్తు చేసుకొని రామ్ ఎమోషనల్.. తనని స్కూల్ కి పిలిపించిన రామలక్ష్మి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -340 లో.... రామలక్ష్మి క్లాస్ చెప్తుంటే రామ్ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. రామలక్ష్మికి ఏం చెయ్యాలో అర్ధం కాదు. అప్పుడే సీతాకాంత్ వస్తాడు. రామ్ అలా చెప్తే వినడు అంటూ ఎలా చెప్తే వింటాడో సీతాకాంత్ చెప్తాడు. రామ్ ఇప్పుడు మనం గేమ్ ఆడుదామా అని రామలక్ష్మి అంటుంది. దాంతో రామ్ సరదాపడుతూ ఆడుదామని అంటాడు. దాంతో రామలక్ష్మి, సీతాకాంత్, రామ్ లు దాగుడుమూతలు ఆడుతారు. రామలక్ష్మి సీతాకాంత్ లు దగ్గరగా వచ్చి తమ జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటారు.

Brahmamudi : కీలక ఆధారం సేకరించిన అప్పు, కావ్య‌‌.. రాజ్ కి శిక్ష పడుతుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -657 లో..... మీ వల్ల కాకపోతే చెప్పు మేమ్ చూసుకుంటామంటూ రుద్రాణి అప్పు, కావ్యలతో రుద్రాణి అంటుంది. నువ్వు సైలెంట్ గా ఉండు అంటూ రుద్రాణిని సుభాష్ కోప్పడతాడు.ఆ తర్వాత కావ్య రాజ్ కి భోజనం తీసుకొని వెళ్తుంది. అసలేం జరిగిందని కావ్య అడుగుతుంది. హత్య జరిగిన కోణంలో ఆలోచిద్దాం.. మీరు రాత్రి అక్కడికి వెళ్ళినప్పుడు ఆఫీస్ బయట ఎవరైనా ఉన్నారా అని కావ్య అడుగుతుంది. అక్కడ బయట ఒక తాగుబోతు మందుకి డబ్బుల కోసం నా దగ్గరికి వచ్చాడు.. అతని పేరు లిక్కర్ కమలేష్ అని రాజ్ చెప్తాడు.

కలర్ ఫుల్ అమ్మాయిని చూసుకోవాలంటూ రాజీవ్ కి దీపికా సలహా

బుల్లితెర మొత్తం కూడా కొత్త కొత్త షోస్ తో ఫుల్ కలర్ ఫుల్ గా మారిపోయింది. అలాగే ఓటిటి ప్లాట్ఫామ్ కూడా కొత్త షోస్ తో మెరిసిపోతున్నాయి. ఇక కొత్తగా ఆహా ప్లాట్ఫామ్ మీద "చెఫ్ మంత్ర  ప్రాజెక్ట్ కే" పేరుతో ఒక కొత్త వంటల షో రాబోతోంది. ఈ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమోలో జిగేల్ డ్రెస్సులతో అంబటి అర్జున్, అమర్ దీప్ వచ్చారు. ఆ తర్వాత  యాంకర్ విష్ణు ప్రియా -పృథ్వీ, సుప్రీత-యాదమ్మ రాజు, యూట్యూబర్స్ ఐన ప్రశాంత్-ధరణి ఈ షోలోకి వచ్చేశారు. హోస్ట్ గా సుమ, జడ్జ్ గా జీవన్ వచ్చారు. ఇక వంటగాళ్లందరికీ మైసూర్ బోండా చేయాలంటూ టాస్క్ ఇచ్చాడు. తర్వాత జీవన్ దీపికా దగ్గరకు వచ్చి "ఇందాకటి నుంచి ఇలా తిప్పుతూనే ఉన్నావ్" అన్నాడు.

ఫిష్ ఫ్రైకి కాంబినేషన్ పెరుగన్నం తాలింపా...ఎవ్వరైనా తింటారా ?

ఆహా ఓటిటి ప్లాట్ఫారం మీద "ప్రాజెక్ట్ కే" పేరుతో ఒక కుకింగ్ షో రాబోతోంది. ఇక ఈ షో మార్చి 6నుంచి  రాత్రి 7గంటలకు ప్రతి గురువారం ప్రసారం కాబోతుంది. ఈ కార్యక్రమాన్ని సుమ హోస్ట్ చేయబోతుంది. ఆమెకి హెల్పర్‌గా కమెడియన్ జీవన్ కనిపించబోతున్నారు. ఇందులో బుల్లితెర స్టార్స్  బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అమర్ దీప్, అంబటి అర్జున్‌  "అల్టిమేట్ బ్రదర్స్‌ ఆఫ్ ది కిచెన్" గాళ్ కనిపించి మంచి కామెడీని అందించబోతున్నారు. ఇప్పుడు ఈ ప్రోమో వైరల్ అయ్యింది. ఈ ప్రోమోలో అంబటి అర్జున్ చేతిలో ప్లేట్ పట్టుకుని  ‘అరేయ్ అమర్‌గా... ఫిష్ ఫ్రై తెచ్చానూ.. దీనికి కాంబినేషన్‌గా పచ్చి పులుసు తీసుకునిరా" అంటాడు.

అంట్లు తోమడాలు, వంట చేయడాలు... ఓంకార్ షో అంటే ఆ మాత్రం ఉంటది  

బుల్లితెర మీద ఓంకార్ కి ఉన్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇష్మార్ట్ జోడి 3 హోస్ట్ గా చేస్తూ ప్రతీ వారం మంచి మంచి కంటెంట్ తో ఆడియన్స్ ని అలరిస్తున్నారు. ఇక ఈ వారం ప్రోమో చూస్తే మాములుగా లేదు. ఇంటింటి రామాయణం పేరుతో ఈ ఎపిసోడ్ రాబోతోంది. ఈ షోలో జోడీస్ తో అంటే మొగుడు పెళ్లాలతో అంట్లు తోమిచ్చేసాడు. ప్రదీప్-సరస్వతి, రాకేష్-సుజాత, ప్రేరణ-శ్రీపాద్ జోడీలతో దగ్గరుండి మరీ హింట్స్ ఇచ్చి తోమించాడు. కొంతమందికి  బూడిద, కొందరికి ఇటుక పొడి ఇచ్చాడు. అంట్లను నీట్ గా తోమమని చెప్పాడు. "అన్నా ఇంత బతుకు బతికి ఈ పని చేస్తే బాగోదేమో అన్నా ఆలోచించావా" అన్నాడు రాకేష్. "ఇంటరెస్ట్ లేకపోతె రండయ్యా మేము కడుక్కుంటాం" అంటూ ఆదిరెడ్డి సెటైర్ వేసాడు.

మోటివేట్ చేసే శత్రువైనా పర్లేదు కానీ నాశనం చేసే మంచి మిత్రుడిని ఎంచుకోకు...గీతోపదేశం

మనం కొన్ని కొన్ని చూసినప్పుడు కొన్ని భావాలు ఆటోమేటిక్ గా మనసులో వచ్చేస్తూ ఉంటాయి...రీసెంట్ గా గీతామాధురి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ సారాంశం ఏంటంటే.. "మనం డిప్రెషన్ లో ఉన్నపుడు కానీ, బాధపడినప్పుడు కానీ ఎదురు ఎవరు ఉన్నా కూడా వాళ్ళ ద్రుష్టి మన మీద ఉండాలని..మనల్ని వాళ్ళు చూడాలని విపరీతమైన తాపత్రయపడిపోతూ ఉంటాం.. కానీ వేరే మనిషి కోసం పడే ఆ  తాపత్రయమే మనకు మన జీవన విధానానికి, మన ఆరోగ్యానికి చెడు చేస్తుంది..అదొక ట్రాప్ అన్న విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం...కాబట్టి మనం చివరి శ్వాస విడిచేటప్పుడైనా కానీ జాగ్రత్తగా మనిషిని ఎంచుకోవాలి...మనం మన డిప్రెషన్ హ్యాంగోవర్ నుంచి బయటపడాలంటే జాగ్రత్తగా ఉండాలి.

రోజా-రాశి మధ్య శ్రీకాంత్...ఉప్మా ఛాలెంజ్ లో ఎక్కడో కాలినట్టుంది

సూపర్ సీరియల్ ఛాంపియన్‌‌‌‌షిప్ సీజన్ 4 ప్రోమో రీసెంట్ కొత్తది వచ్చేసింది. ఇందులో ఉప్మా ఛాలెంజ్ మాములుగా లేదు భయ్యో.  ఇందులో రాశి-రోజా  మధ్య "ఉప్మా మేకింగ్ ఛాలెంజ్" పెట్టారు. ఇక రాశి ఉప్మా చేస్తోంది. శ్రీకాంత్ ఆమెకు హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతో  ఏదో సాయం చేద్దామనుకొని శ్రీకాంత్ కప్పుతో రవ్వ వేయబోతుండగా హోస్ట్ రవి మధ్యలో వచ్చి అయ్యయ్యో కప్పుతో కాదు చేత్తో వేయాలి అన్నాడు. దీంతో అవాక్కయిన రాశి "చాలు చాలు" అంటూ వేసే రవ్వను కూడా ఆపించేసారు. ఇక ఇంకో వైపు ఉప్మా ఛాలెంజ్ కోసం పోటీ పడుతున్న రోజా దగ్గరికెళ్లి గిన్నెలో ఉన్న ఉప్మా రవ్వను చూపించి వేసేయ్యనా  అని అడిగాడు.

Illu illalu pillalu: ప్రేమ, ధీరజ్ ల సావాసం.. స్వయంవరంలో బకరా అతడేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu)'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-93లో.. పెద్దోడి వివాహ పరిచయ కార్యక్రమం ఎక్కడైతే జరుగుతుందో సరిగ్గా అదే ప్రాంతానికి కళ్యాణ్‌ని పట్టుకోవడానికి ప్రేమ, ధీరజ్ వెళ్తారు. ఇక భద్రాద్రిలో దిగిన తరువాత వాళ్ళిద్దరు ఆటో ఎక్కుతారు. ప్రేమ ఆటో సీటు వెనుక కూర్చుని ఇబ్బంది పడుతూ ఉంటుంది. గట్టిగా నా చేయి పట్టుకుని కూర్చో లేదంటే పడతావ్ అని ధీరజ్ అంటే.. మాకు తెలుసులే అని ఓవరాక్షన్ చేస్తుంది. ఇంతలో డ్రైవర్.. ఆటోని గోతిలో పెడతాడు. దాంతో ప్రేమ తల టంగుమంటుంది. ఇక ఇరుకు ఇరుకుగా కూర్చోవడంతో.. ధీరజ్ వచ్చి ప్రేమపై పడుతుంటాడు.. ప్రేమ వెళ్లి ధీరజ్‌పై పడుతుంటుంది. అయిన ప్రేమ మాత్రం ధీరజ్‌కి టచ్ కాకుండా ఉండాలని చిరాకుపడుతుంటుంది. దాంతో ఆటో డ్రైవర్‌‌పై అరుస్తుంది. ఆటోని రోడ్డుపై నడుపుతున్నావా? ఇంకెక్కడైనా నడుపుతున్నావా? సరిగా చూసుకోమని ప్రేమ అరుస్తుంది.

Karthika Deepam2: రొమాన్స్ లో కార్తీక్ బాబు, దీపక్క.. ఒకరిపై ఒకరు పడి మరీ!

​స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం2(Karthika Deepam2)..ఈ సీరియల్  గురువారం నాటి ఎపిసోడ్-292లో.. శివనారాయణ, సుమిత్ర, దశరథ్, పారిజాతంలు జ్యోత్స్న భవిష్యత్ గురించే మాట్లాడుకుంటారు. జ్యోత్స్నను ఇండియాలో ఉండకూడదు.. ఏ అమెరికానో పంపించేయండి అంటూ పారిజాతం సలహా ఇస్తుంది. అయితే దశరథ్‌కి అది ఇష్టం ఉండదు. దాసు పూర్తిగా కోలుకుని నిజం ఏంటో తెలిసే వరకూ జ్యోత్స్న ఇక్కడే ఉండాలని మనసులో అనుకుంటాడు. శివనారాయణ బాధగా.. సరే ఇవన్నీ కాదు దాని తల్లిదండ్రులుగా మీరిద్దరూ ఏం అంటారో చెప్పండి అని  సుమిత్ర, దశరథ్‌లతో అంటాడు. వద్దు నాన్నా.. మనం ఉంటేనే ఇలా ఉంటుంది అంటే.. మనం కళ్లముందు లేకుంటే ఇంకెలా తయారవుతుందో కదా అంటూ దశరథ్ అంటాడు. ఇంతలో జ్యోత్స్న వస్తుంది. మళ్లీ పెళ్లి గురించి గొడవ జరుగుతుంది. నీ పెళ్లి చేస్తానని మీ అమ్మకు మాటిచ్చాను.. నీ పెళ్లి చేసే నేను చస్తానని శివనారాయణ ఫైనల్‌గా చెప్పి వెళ్లిపోవడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది.