ఎవరింట్లోకి తొంగి చూడొద్దు ..బుద్దిగా మీ పెళ్లాలతో కాపురం చేసుకోండి
ఈ వారం జబర్దస్త్ షో ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో మెసేజ్ ఓరియెంటెడ్ గా సాగింది. అందులోనూ ఇమ్ము వర్ష స్కిట్ లో ఆ మెసేజ్ ఇవ్వడం కనిపించింది. వర్షతో పాటు మరో ఇద్దరు లేడీ కమెడియన్స్ అలాగే ఇమ్ము, పండు, దుర్గారావు కలిసి ఈ స్కిట్ లో చేశారు. ఐతే దుర్గారావు వర్షను పెళ్లి చేసుకుంటాడు. ఇక వర్ష సిస్టర్స్ ని పండు, ఇమ్ము పెళ్లి చేసుకుంటారు. వాళ్లకు వాళ్ళ భార్యలు నచ్చరు. అలా ముగ్గురూ కూడా వర్ష మీదనే కన్నేశారు. ఐతే ఏమీ తెలియని దుర్గారావుకు వర్ష లాంటి మంచి భార్య వచ్చేసరికి పండు, ఇమ్ము కుళ్లిపోయి దుర్గారావును చంపేసి వర్షను పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. ఐతే ఇమ్ము మూడు విషయం కలిపినా బాటిల్స్ తెచ్చి మిగతా ఇద్దరికీ ఇస్తాడు. అలా ముగ్గురు తాగేసాక పండు, ఇమ్ము కూడా గొంతు పట్టుకుంటారు. ఐతే వర్ష ఎవరికీ తెలీకుండా పండుని, ఇమ్ముని వేసేయాలని వాళ్ళ బాటిల్స్ విషం కలిపేసింది. ఆ విషయం తెలుసుకున్న ఇద్దరూ షాకయ్యారు.